కల్తీ నువ్వుల నూనె ఆరోగ్యానికి ఎంత ప్రమాదమంటే …………..

November 1, 2016

ఒరిజినల్ నువ్వుల నూనెకు , కల్తీ చేసిన నువ్వుల నూనెకు తేడాను మీరు కనిపెట్టగలరా……….?

కల్తీ చేసిన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది……….?

ఒక్కసారి దీన్ని చదవండి. అన్ని విషయాలూ మీకు తెలుస్తాయి.

pamplet-jpg1-copy-copy

నువ్వుల నూనె అంటే చాలామందికి తెలియక,
ముదురు ఎరుపు రంగులో ఉండే నూనెను పూజకు వాడుతున్నారు.
కానీ అది ఒరిజినల్ నువ్వుల నూనె కాదు.

ఆ నూనె ఎక్కడిదంటే……………..,
రోడ్ల ప్రక్కన ఉన్న పునుగులు, బజ్జీల బళ్లలో వాటిని వేయించగా మిగిలిన నూనె మరియు
చిన్న చిన్న హోటళ్ళ లో వివిధ ఆహార పదార్థాలను వేపుడు చేశాక,
మిగిలిన నూనెను ……………. నూనె అమ్మే వ్యాపారస్తులకు సప్లై చేసి,
దానికి కొంత మొత్తం లెక్కకట్టి , వారు తిరిగి కొనే నూనెలో మినహాయిస్తున్నారు.

ఆవిధంగా గారెలు, పకోడీలు,బజ్జీలు,పునుగులు లాంటివి వండి మిగిలిన నూనెను అమ్మితే
దానిని ప్యాక్ చేసి అందమైన బాటిల్స్ లో ముస్తాబు చేసి
పూజకు ఉపయోగించే నూనెగా ప్రచారం చేసి అమ్ముతున్నారు.

ఈ నూనె లీటరు 60 లేదా 70 రూపాయలు ఉండటంతో
దీన్నే ఎక్కువ మంది వాడుతున్నారు.

ఆ నూనెను దీపాలు వెలిగించడానికి వాడటం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

ఊపిరితిత్తుల సమస్య ఉన్నవాళ్ళ ఆరోగ్యం క్రమంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
శ్వాసకు పూర్తిగా ఇబ్బంది కలిగి , ప్రాణాపాయం కలిగే ప్రమాదం ఉంది.

ఒరిజినల్ నూనెను ఎలా కనిపెట్టాలి…………?

ఈ కల్తీ నూనె ముదురు ఎరుపు రంగులో ఉంటుంది.
ఈ నూనెను వాడితే దీపపు కుందెలు క్రమంగా రంగు మారిపోయి, నల్లబడిపోతాయి.
ఒరిజినల్ నువ్వుల నూనె, దాదాపుగా కొబ్బరి నూనె ఉన్న రంగులో స్వచ్చంగా ఉంటుంది.
లీటర్ 60 లేదా 70 రూపాయల తక్కువ ధరకు అది లభించదని గుర్తించండి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...