కల్తీ కారంపొడితో క్యాన్సర్ – అసలేం కలుపుతున్నారో తెలిస్తే షాక్

November 5, 2016

కారంపోడిలో కలిపే కల్తీతో …. క్యాన్సర్ రోగులు విపరీతంగా పెరిగిపోతున్నారు
అసలు కారం పొడిలో ఏం కల్తీ కలుపుతున్నారో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు

మనం నిత్యం వంటల్లో వాడే వాటిలో కారం పొడి ( మిరప పొడి ) కూడా ప్రధానమైనది.
అలాంటి కారంపొడి లో కలిపే కల్తీతో ఇప్పుడు కారం పొడి కాస్తా విషపు పొడిగా మారిపోయి భయంకరమైన క్యాన్సర్ ను ప్రజలకు కలిగిస్తోంది. మనం తినే కారంలో యాభై శాతం కల్తీదే.

mirapa

అసలు ఈ కల్తీ ఎలా చేస్తున్నారంటే…………….

తాలుకాయలు ( తెల్ల కాయ ) , మిర్చి తొడాలను మిల్లులో పొడిగా మారుస్తారు.

ఈ పొడితో పాటు , నాణ్యమైన మిరపలో ఒలియా రీజన్ ఆయిల్ ను తీస్తారు .
దాంతోపాటు రంగు వస్తుంది. ఈ రెండు పోనూ , కొంత పిప్పి మిగులుతుంది. ఈ పిప్పి దేనికీ పనికి రాదు.

సాధారణంగా పిప్పిని తగలబెట్టడమో, విద్యుత్ తయారు చేసే సంస్థలకు అమ్ముకోవడమో
మిల్లు యజమానులు చేస్తుంటారు. కానీ కొందరు మిల్లు యజమానులు దారితప్పి
ఈ వ్యర్థాలను వాడి కారంలో కల్తీకి పాల్పడుతున్నారు.

ఇలా తయారైన మిర్చిలో కేవలం నలభై శాతం మాత్రమే కారం పొడి ఉంటుంది.

కల్తీ కారంలో రంగు కోసం రెడాక్సైడ్ రసాయనపదార్థాలను కలుపుతున్నారు.
దీనివల్ల కారానికి మంచి ఎరుపు రంగు వస్తుంది.

అయితే ఈ మిశ్రమం కలిపిన కారం తినే వారికి
క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలాగే మిరప తొడాలలో పురుగు మందుల అవశేషాలు ఉంటాయని ,
వాటిని కారం తయారీకి వాడితే ప్రాణాలకు ముప్పేనని చెబుతున్నారు.

ఈ కారం వాడిన రోగుల్లో లివర్ , కిడ్నీ రుగ్మతలను వైద్యులు గుర్తించారు.

ఒరిజినల్ కారం మార్కెట్ లో నుండి పలుకుతుండగా కల్తీ కారం పెడితే వచ్చేస్తుండటంతో……
ప్రధానంగా చిన్న వ్యాపారులు , తోపుడు బండ్లు , చిన్న చిన్న హోటళ్ళ యజమానులు
ఈ కల్తీ కారం పొడిని ఎక్కువగా వాడుతున్నారు.

ఇటీవల గుంటూరులోని మిల్లుల్లో విజిలెన్స్ వారి తనిఖీల్లో భారీ స్థాయిలో కల్తీ కారం పొడి పట్టుబడింది. కాబట్టి అందరూ జాగ్రత్త పడండి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...