కరెన్సీ కష్టాలున్న ఈ సమయంలో …… చిన్న వ్యాపారులను ఇలా చేసి ఆదుకుందాం

November 17, 2016

500/- RS , 1000/- RS నోట్లు అకస్మాత్తుగా రద్దు కావడంతో సామాన్యుల , మధ్యతరగతి వారి జీవితాలు ఏంచేయాలో తెలియని కుదుపునకు గురయ్యాయి.

రోడ్డు ప్రక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ బ్రతుకులు వ్యాపారాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. చలామణీలో ఉన్న కరెన్సీ అర్ధాంతరంగా రద్దు కావడం , వచ్చిన కొత్త కరెన్సీ గానీ ,
ఉన్న పాత 10 , 20 , 50 , 100 రూపాయల నోట్లు చాలినన్ని లేకపోవడంతో వ్యాపారాలన్నీ కూడా పూర్తిగా మందగించాయానే చెప్పవచ్చు.

brati

ఈ సందర్భంగా మన వంతుగా చేయూతనివ్వడానికి నాదొక చిన్న విన్నపం :

మనం బ్యాంకుల నుండి గానీ , ఎటియం ల నుండి గానీ డబ్బులు తీసుకున్న తర్వాత ……
మన ఇళ్లకు అవసరమయ్యే కూరగాయలను గానీ , పండ్లను గానీ …………
బజారుల్లో పెట్టుకొని అమ్మే చిన్న వ్యాపారస్తుల దగ్గర కొనండి.

మనం 50 రూపాయలకో 100 రూపాయలకో వారి దగ్గర కొంటే …..
అది వారికిప్పుడు పది వేలతో సమానమని అర్థం చేసుకోండి.

ఎందుకంటే మనం ఇచ్చే ఆ నోట్లతోనే మళ్ళీ పెట్టుబడి పెట్టి పండ్లను , కూరగాయలను కొనుక్కోవాలి……. మిగిలిన దానితో కుటుంబం గడవాలి.

ఈ చిన్న వ్యాపారమంతా నడిచేది కరెన్సీ నోట్ల మీదనే.

కాబట్టి కరెన్సీ కష్టాలున్న ఈ కొన్నిరోజుల పాటైనా మీరు సూపర్ మార్కెట్లకు , మాల్స్ కు వెళ్ళి నప్పుడు
కరెన్సీ కాకుండా కార్డ్ లను ఉపయోగించండి.

కాబట్టి మిత్రులారా …..! పండ్లను , కూరగాయలను , ఆకుకూరలను బజారుల్లో ఉండే
చిన్న వ్యాపారస్తుల దగ్గరే కొనండి.

ఈ కష్ట సమయంలో మనం 50 రూపాయలతో గానీ , 100 రూపాయలతో గానీ కొంటే, అదే వారి బ్రతుకులను నిలబెడుతుంది. బ్రతుకు పట్ల వారికి భరోసానిస్తుంది.

ప్రతిరోజూ కాకపోయినా , రోజు మార్చి రోజైనా కొన్నాళ్ళ పాటు అలా చేయండి.

ఈ కరెన్సీ కష్టాలు తీరేంత వరకు చిన్న వ్యాపారస్తులను మన వంతుగా ఆదుకుందాం.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...