ఓంకారం యొక్క గొప్పతనం ఏమిటంటే…………..

November 2, 2016

ఓంకార పరమార్థం……

”ఓం” అంటూ ఉచ్చరించే ఓంకారం పరమ పవిత్రమైంది.
ఓంకారం సంస్కృతంలో ”ॐ” అక్షరం దైవంతో సమానం, ప్రణవ స్వరూపం,
ఓంకారం శివరూప తత్వం.

మహాశివుడు డమరుకం మోగిస్తున్నప్పుడు ఆ ధ్వనిలోంచి జనియించినదే ఓంకారం . ఓంకారం యొక్క మహత్తును మన శాస్త్రాలు ఎంతో గొప్పగా చెప్పాయి.

om

ఓంకారాన్ని మించిన మంత్రం లేదనీ, మహా మహిమాన్వితమైన ఓంకారానికి ప్రధానంగా 18 అర్ధాలను సూచించాయి. ఆ అర్ధాలు ఏమిటో తెలుసుకుందాం.

ఓంకారం తేజోవంతమైంది.సర్వలోకానికీవెలుగునిస్తుంది.

ప్రేమైకతత్వాన్నిఇస్తుంది.

ఓంకారం ప్రశాంతతని,ఆనందాన్ని,సంతృప్తిని ప్రసాదిస్తుంది.

గ్రహణశక్తిని పెంచి,అనేక అంశాలను అవగాహనచేసుకునే అవకాశం కలిగిస్తుంది.

ఓంకారం నిత్యజీవితంలో కలిగే కష్టనష్టాల నుండి రక్షిస్తుంది.

సృష్టిలో సూక్ష్మ ప్రాకృతిక అంశాలను స్థూలమార్గంలోకి తెస్తుంది.

ఓంకారం సూక్ష్మరూపంలో ప్రాణకోటిలో ప్రవేశిస్తుంది.

ప్రళయకాలంలో జగత్తును తనలో లీనం చేసుకుంటుంది.

ఓంకారం స్థూల, సూక్ష్మ, గుప్త, శబ్దనిశ్శబ్దాలను గ్రహిస్తుంది.

ప్రబోధాత్మకమైన బుద్ధిని ప్రసాదిస్తుంది.

ఓంకారం చరాచరజగత్తును శాసిస్తుంది.

అజ్ఞానాన్ని,అంధకారాన్నినశింపచేస్తుంది.

ఓంకారం విద్యను,వివేకాన్ని,జ్ఞానాన్ని,తేజస్సునూ ఇస్తుంది.

సర్వఐశ్వర్యాలనూ కల్పిస్తుంది.

ఓంకారం శుద్ధ అంతఃకరణను ప్రసాదిస్తుంది.

ఓంకారం సర్వవ్యాపితం అయినది.

ఓంకారం సమస్ తజగత్తుకూ నాయకత్వం వహిస్తుంది.

కోరికలకు దూరంగా ఉంటూ, అందరి శ్రేయస్సూ కోరుకోవాలని ఉపదేశిస్తుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...