ఒక విదేశీయుడు వందల కోట్లతో నిర్మించిన ఆలయం విశేషాలేమిటంటే…. ……

October 28, 2016

ఒక విదేశీయుడు వందల కోట్లతో నిర్మించిన శ్రీకృష్ణాలయం మనదేశంలో ఉన్నదనే విషయం
మీకు తెలుసా………?

ప్రపంచంలో ఉన్న అతి పెద్ద దేవాలయాల్లో అది కూడా ఒకటనే విషయం మీకు తెలుసా……..?

ఆధ్యాత్మిక స్పూర్తిని ఇచ్చే ఆ వివరాలను ఒక్కసారి చదవండి.

vedic-planitorium

చంద్రోదయ దేవాలయము లేదా వేదిక్ ప్లానిటోరియం గా పిలువబడే ఈ ఆలయం పశ్చిమ బెంగాల్ లో ఉంది.

ఆలయ నిర్మాణానికి ప్రేరణ ఏమిటంటే……..

ప్రపంచ స్థాయి కార్ల కంపెనీ ఫోర్డ్. ఆ కంపెనీ వ్వవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్. అతని తనయుడు ఆల్ఫ్రెడ్ ఫోర్డ్. అతనిది రాజా లాంటి జీవితం. కాని అతనికున్న సంపద, పేరు ప్రఖ్యాతులు అతనిని ఎంతోకాలం సంతోషపెట్టలేక పోయాయి. జీవితంలో ఏదో ఒక మార్పు కోసం అనేక మార్గాలను అన్వేషించాడు.

అప్పటివరకు భగవద్గీత అంటే తెలియని అతను మొదటిసారిగా అంతర్జాతీయ కృష్ణసమాజం (ఇస్కాన్) వ్యవస్థాపకులైన శ్రీ ప్రభు పాదులు వారు రచించిన భగవద్గీత ను చదివారు.

అందులో శ్రీకృష్ణుని గొప్ప వ్వక్తిగా చిత్రించిన తీరు ఫోర్డ్ ను అమితంగా ఆకట్టుకొన్నది.
దాంతో 1975 లో అతను శ్రీకృష్ణుని భక్తుడైపోయాడు. తర్వాత తన పేరును అంబరీషగా మార్చుకున్నాడు. పూర్తిగా శాఖాహారి యై తన ఆహారాన్ని తానె వండుకోవడము మొదలెట్టాడు.

డెట్రాయట్ లో ఒక పెద్ద భవంతిని కట్టించి దాన్ని కృష్ణ మందిరంగా మార్చారు.
దాని ప్రారంబోత్సవానికి ఫోర్డ్ తల్లిదండ్రులతో బాటు శ్రీప్రభుపాదుల వారు కూడ వచ్చారు.

ఆ సందర్భంలో శ్రీ ప్రభుపాదుల వారు…. ఇస్కాన్ ప్రధాన్ కేంద్రమైన పశ్చిమ బెంగాల్ లోని మాయాపూర్ లో అంతర్జాతీయ స్థాయి దేవాలయాన్ని నిర్మించాలని వున్న తన మనసులోని మాటను ఫోర్డ్ కి చెప్పారు.

ఫోర్డ్ ఆ కోరికను నెరవేర్చాలనుకున్నారు. ఆ మహా కట్టడం 2010 లో మెదలెట్టి మూడేండ్లలో పూర్తి చేశారు. 400 కోట్ల అంచనా వ్వయంలో 300 కోట్లు ఫోర్డ్ భరించగా, మిగిలిన 100 కోట్లు దాతల ద్వారా సమకూర్చుకున్నారు.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాయాపూర్ లో ఏడు లక్షల చదరపు అడుకుల విస్తీర్ణంలో నిర్మితమైన
ఈ విశాలమైన దేవాలయంతో పాటు ఇక్కడ మూడు వందల మంది కూర్చోడానికి సరిపడేంత వైశాల్యంలో ప్లానెటోరియాన్ని, వైదిక విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించారు.

ఫోర్డ్ కుటుంబము గురించి…………

1980 లో సిడ్నీలో ఇస్కాన్ కార్యక్రమాలలో భాగమైన రధ యాత్రలో శ్రీ కృష్ణ తత్వం అలవడిన ఫోర్డ్ పాల్గొన్నారు. ఆ సందర్భంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రవాస భారతీయురాలైన షర్మిల పరిచమయ్యారు. ఆమెకూడ కృష్ణ భక్తురాలు కావడముతో ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి.

అలా 1983 లో వారి వివాహము జరిగిపోయింది. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. వారు అమృత, అనీష. పిల్లలు పుట్టాక పోర్డ్ దంపతులు పిల్లలతో సహా ఉత్తర అమెరికాలోని గెయింస్ విల్లేకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ ఉత్తర అమెరికాలోకెల్ల అతి పెద్ద శ్రీకృష్ణ మందరిరం వున్నది. అక్కడ వుంటే తమ పిల్లలకు కృష్ణ తత్వం బాగా అలవడుతుందని వారి అభిప్రాయం.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...