ఒక బ్రిటీషర్ ఆ శివాలయాన్ని మాత్రమే కట్టించడంలోని మహత్యం ఏమిటంటే …….

November 7, 2016

మన భారతదేశంలో ఒక బ్రిటీష్ ఆఫీసర్ దేవాలయాన్ని కట్టించాడనే విషయం మీకు తెలుసా……?

మన దేశంలో బ్రిటీషర్లు కట్టించిన ఏకైక దేవాలయం అదే అన్న విషయం మీకు తెలుసా……….?

ఆ ఆలయ విశేషాలను ఒక్కసారి చదవండి.

baidya-nath-temple

అది 1880 వ సంవత్సరం……….
మన దేశంలోకి ఉద్యోగ బాద్యతల మీద వచ్చిన కల్నల్ మార్టిన్ ను ఆఫ్ఘన్ యుద్ధం లో
విధులు నిర్వహించమని బ్రిటీష్ ప్రభుత్వం ఆదేశించింది.

అక్కడ యుద్ధానికి వెళ్ళిన కల్నల్ మార్టిన్ క్షేమ సమాచారాలు చాలా రోజులయినప్పటికీ తెలియకపోవడంతో, అతని భార్య తీవ్ర మానసిక వేదనలో ఉంది.ఒకరోజు ఆమె దారిలో వెళుతూ ఉండగా ,
ప్రక్కనే ఉన్న శిథిలమై పోయిన దేవాలయం నుండి గంటల శబ్దం వినిపించగానే ,
అప్రయత్నంగా లోపలికి వెళ్ళింది.

అక్కడున్న పూజారి ఈమెను చూడగానే,
“ మీరు చాలా దుఃఖంలో ఉన్నారు………….బాధపడకండి………. కంగారుపడకండి……….పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ………….
పరమ శివున్ని నమ్ముకోండి………….అంతా మీకు మంచే జరుగుతుంది” అని చెప్పాడు.

ఆ పూజారి మాటలను పూర్తిగా విశ్వసించిన ఆమె పదకొండు రోజుల పాటు పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ కాలం గడిపింది. అప్పుడు క్షేమంగా ఇంటికి తిరిగివచ్చిన కల్నల్ మార్టిన్ కు
ఆ ఆలయంలో తనకు జరిగిన అనుభవం గురించి చెప్పింది.

అతను కూడా యుద్ధంలో మరణం అంచు వరకూ వెళ్ళి ,
ఒక అదృశ్య శక్తి చేత తాను ఎలా బయటపడ్డదీ తన భార్యకు వివరించి చెప్పాడు.

వాళ్ళు ఇరువురూ పూర్తి విశ్వాసం తో ఆలయానికి చేరుకున్నారు.
శిథిలమైన దేవాలయాన్ని వేలాది రూపాయలు ఖర్చు పెట్టి గొప్ప నిర్మాణంగా కట్టించారు.

ఆ ఆలయం ముందు ఉన్న శిలా ఫలకంపై తమ కథను కల్నల్ మార్టిన్, ఆయన భార్య వ్రాయించారు.

బైద్యనాథ్ దేవాలయంగా పిలవబడుతున్న ఆ మందిరం మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లాలోని
అగర్ మాల్వాలో ఉంది. భారత దేశంలో బ్రిటిషర్ కట్టించిన ఏకైక దేవాలయం అది….

కొన్నాళ్లకి కల్నల్ మార్టిన్ సతీ సమేతంగా ఇంగ్లండుకు తిరిగి వెళ్లిపోయారు.

అక్కడ కూడా వారి ఇంట్లో ఒక శివుడి విగ్రహం పెట్టుకున్నారు. చివరి వరకూ ఆయన్నే పూజించారు..

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...