ఒక నెల ముందే ఈ ఆరు లక్షణాలు కనిపించాయా…! – అయితే తప్పకుండా గుండెపోటు వచ్చే అవకాశం

November 10, 2016

ప్రపంచంలో సంభవిస్తున్న అత్యధిక మరణాల్లో గుండె పోటు వల్ల కలిగేవి కూడా ముందు వరుసలో ఉన్నాయి. కానీ కొన్ని లక్షణాలను మనం ముందుగానే గమనించినట్లయితే ప్రాణాపాయం నుండి బయటపడొచ్చు.
గుండెపోటు మరణాలు అధికంగా సంభవించడానికి ముఖ్యంగా మూడు అంశాలను ప్రముఖంగా పేర్కొనవచ్చు. అవి ఏమిటంటే

BUSY LIFE STYLE
UN HEALTHY DIET
STRESS

heart

నేటి కాలపు మనుషుల జీవితాలను గుండెపోటు రూపంలో అర్ధాంతరంగా ముగించేట్లుగా చేయడంలో
ఈ మూడే ప్రధాన కారణాలు అవుతున్నాయి. కానీ ఏ వ్యక్తిలో అయినా కూడా గుండె పోటు రావడానికి
ఒక నెల రోజుల ముందుగానే ప్రధానంగా 6 లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించినట్లయితే
మనం ప్రాణాలతో బయటపడొచ్చు. ఆ ఆరు లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాడీ వీక్ నెస్ కావడం
****************
గుండె కు సంబంధించిన ఆర్టేరీస్ కుంచించుకు పోవడంతో , రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దాని వల్ల శరీరం వీక్ నెస్ కావడంతో పాటు , కండరాలు కూడా వీక్ అయిపోతాయి. గుండె పోటు వచ్చేవారిలో ఇది ప్రథమ లక్షణంగా కనిపిస్తుంది.

త్వరగా చెమటలు పట్టడం మరియు మైకంగా ( మత్తుగా ) అనిపించడం
**************************************************
రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు , మెదడుకు రక్తం తక్కువగా అందుతుంది. దానివల్ల చమటలు పట్టడం , మత్తుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. మెదడు సక్రమంగా పనిచేయకపోవడంతో , శరీరం పనులకు సహకరించడం లేదని అనిపిస్తుంది. ఈ ప్రధాన లక్షణం కనిపిస్తోందంటే , త్వరలో గుండెపోటు రాబోతోందని సంకేతంగా భావించాలి.

చాతీ పట్టేసినట్లుగా అనిపించడం
**********************
చాతీ పట్టేసినట్లుగా అనిపించడం అనేది గుండె పోటు వచ్చే ముందు కనిపించే అతి ముఖ్యమైన లక్షణాలలో ప్రముఖమైనది. అలా ఉండే స్థితి క్రమేపీ వీపు భాగానికి , భుజాలకు పాకినట్లయితే తప్పకుండా జాగ్రత్త పడాల్సిందే.

జలుబు మరియు ఫ్లూ జ్వరం రావడం
***********************
గుండెపోటు కు గురైనవాళ్ళు చాలా మంది చెప్పే విషయం ఏమిటంటే…….. గత కొన్ని రోజుల క్రితం వారికి జలుబుతో కూడిన జ్వరం వచ్చి చాలా ఇబ్బంది పెట్టిందని. కానీ ఈ విషయాన్ని చాలా మంది గమనించలేరు.

అతి త్వరగా అలసిపోవడం
******************
ఎప్పుడూ అలసిపోయినట్లుగా ఉండటం గానీ , లేదా కొద్దిగా పని చేయగానే అతి త్వరగా అలసిపోవడం జరుగుతున్నదంటే ఖచ్చితంగా జాగ్రత్తపడటం ఎంతో మంచిది. ఎందుకంటే గుండె నరాలలో రక్త ప్రసరణ సరిగా జరగనందువల్ల , సాధారణం కంటే గుండె పై అధికంగా ఒత్తిడి పడుతుంది . అందువల్ల త్వరగా అలసిపోయే పరిస్థితి వస్తుంది .

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడం
********************************
గుండె కు ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా ఆ ప్రభావం ఊపిరితిత్తుల మీద పడుతుంది. గుండె నరాలు కుంచించుకుపోయి , రక్త ప్రసరణ సరిగా జరగకుంటే ….. శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే శ్వాస కు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా జాగ్రత్త పడాల్సిందే.

పైన పేర్కొనబడిన ఆరు ప్రధాన లక్షణాలలో అన్నీ గానీ లేదా ఏవైనా కొన్ని గానీ గుండె పోటు వచ్చే ఒక నెల ముందుగానే ఖచ్చితంగా అగుపిస్తాయి . కాబట్టి ముందుగానీ జాగ్రత్తపడి విలువైన ప్రాణాలను కాపాడుకోండి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...