ఒక్కొక్కరికి 3 లక్షలు పంచిన MLA – అసలు నిజం ఏమిటంటే……

November 10, 2016

ఒక ఎమ్మెల్యే ….. అటూ ఇటూ మీటింగులో ప్రక్కన కొందరు …… వెనకాల కన్నడ అక్షరాలతో ఉన్న బ్యానర్ …… మీటింగు లోని టేబుల్ మీద నోట్ల కట్టలు …… ఈ ఫోటోలు నిన్నటి నుండి పేస్ బుక్ లోనూ వాట్సాప్ లోనూ చక్కర్లు కొడుతున్నాయి. మనలో చాలా మంది చూసే ఉంటారు.

mla

పాత 500/- 1000/- నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో…కర్నాటక లోని కోలార్ MLA తన ఊరిలో
ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక్కొక్కరికీ 3 లక్షల చొప్పున పంచిపెట్టాడని ఈ ఫోటోలను పెట్టి
తెగ ప్రచారం చేసారు…. చేస్తూనే ఉన్నారు.

ఈ ఫోటోస్ వాట్సాప్ తో పాటు, ఫేస్ బుక్ లోనూ విపరీతంగా షేర్ అవుతున్నాయి.

ఎలాగైతేనేం మోడీ దెబ్బకు బ్లాక్ మనీ అంతా బయటికి వచ్చిందని, అందరు ఎమ్మెల్యేలూ ఇలాగే చేయాలని , ఎవరి నుండి దోచుకున్న డబ్బు వారికే చేరుతుందని కామెంట్స్ కూడా పెడుతున్నారు ప్రజలు.

అయితే……. ఆఫోటోలు వెనుకున్న అసలు నిజం ఏమిటంటే, అవి ఇప్పుడు తీసినవి కావు అంటున్నారు అధికారులు. గతంలో కోలార్, చిక్ బలపూర్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ వారు రైతులకు లోన్స్ ఇచ్చిన సందర్భంలో తీసినవని, ఒక్కొక్క రైతుకు వారి వ్యవసాయాన్ని బట్టి 50 వేల నుండి 2 లక్షల వరకు లోన్ ఇచ్చారని తెలుస్తోంది.

ఇదండీ నోట్ల కట్టలతో ఉన్న ఆ ఫోటోల వెనక ఉన్న అసలు నిజం.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...