ఒకరు కాదు , ఇద్దరు కాదు ….. 200 మందికి చదువు చెప్పించిన గొప్ప వ్యక్తి

November 9, 2016

ఇప్పుడున్న బిజీ అండ్ మెకానికల్ లైఫ్ లో నేను , నాది అనేదే ఎక్కువగా ఉంది గానీ
సమాజం గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ.

అలా సమాజం గురించి ముఖ్యంగా పేద పిల్లల గురించి ఆలోచించి
ఒక బృహత్తర సేవ చేసిన గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

eduman

ఫోటోలో చూసేందుకు చాలా సామాన్యమైన వ్య‌క్తిగా క‌నిపిస్తున్నా…..
ఆయ‌న ఎంతో మంది పిల్ల‌ల‌కు బంగారు భ‌విష్య‌త్తును ఇచ్చిన వ్య‌క్తి.

అది 2001 వ సంవ‌త్స‌రం. అనుకోకుండా జ‌రిగిన ప్ర‌మాదంలో ఆయ‌న ఎడ‌మ కాలులో రంధ్రం ప‌డింది.
కుడి క‌న్ను చూపు కూడా దాదాపుగా పోయింద‌నే చెప్పాలి.
అదే స‌మ‌యంలో ఆయ‌న‌కు కోలుకునేందుకు దాదాపు 4 ఏళ్లు ప‌ట్టింది.

ఓ వైపు మంచం పై చికిత్స పొందుతూనే తాను అనుకున్న ఓ గొప్ప కార్యానికి ప్ర‌ణాళిక‌లు వేసి దాన్ని ఆచ‌ర‌ణ‌లో పెట్టాడు. త‌న నిర్ణ‌యాన్ని భార్య‌తో పంచుకోగా ఆమె కూడా అందుకు మ‌ద్ద‌తు తెలిపింది.
అంతే అప్ప‌టి నుంచి పేద పిల్ల‌ల బాగు కోసం ఆయ‌న శ్ర‌మిస్తూనే ఉన్నాడు.

యాక్సిడెంట్ అయి బెడ్‌పై ఉన్న‌ప్ప‌టికీ అత‌ను ఏ నిర్ణయం తీసుకున్నాడంటే త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బు అయిపోయే వ‌రకు పేద పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పించాల‌ని. వారు అనుకున్న ల‌క్ష్యాన్ని సాధింప‌జేయాల‌ని అనుకున్నాడు. అందులో భాగంగానే 2001 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న దాదాపుగా 200 మంది పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పించాడు.ఆ పిల్ల‌ల‌ను భావి భార‌త పౌరులుగా, వాళ్ల కాళ్ల మీద వారు నిల‌బ‌డేలా తీర్చిదిద్దాడు.

అంతేకాదు, ఇప్ప‌టికీ ఆయన 40 మంది పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకుని సొంత పిల్ల‌ల్లా చ‌దివిస్తున్నాడు కూడా. ఇప్పుడు ఆర్ధికంగా కొన్ని కష్టాలు ఎదురవుతున్నప్పటికీ కూడా, తన శ్వాస ఉన్నంత వ‌ర‌కు పేద పిల్ల‌ల‌కు స‌హాయం చేస్తూనే ఉంటానంటున్నాడు అత‌ను.

అయితే అత‌ని వ‌ల్ల బాగా చ‌దువుకుని ఇప్పుడు గొప్ప పొజిష‌న్‌లో ఉన్న‌వారు స‌హాయం చేద్దామ‌ని ముందుకు వ‌స్తున్నారు కూడా. అయినా వారికి ఆయ‌న ఒకటే చెబుతున్నాడు. త‌న‌కే స‌హాయం అక్క‌ర్లేద‌ని. వీలైతే వారిని కూడా అలాగే పిల్ల‌ల‌కు స‌హాయం చేయ‌మ‌ని చెబుతున్నాడు.

ఇలాంటి వ్యక్తులు ఈ సమాజంలో ఇంకా ఉన్నారు కాబట్టే మంచి , మానవత్వం అనేవి ఇంకా బ్రతికి ఉన్నాయి.

4 Comments

on ఒకరు కాదు , ఇద్దరు కాదు ….. 200 మందికి చదువు చెప్పించిన గొప్ప వ్యక్తి.
 1. SreeNjvas
  |

  Sir,
  ఆ మహాను భావుని పేరూ, ఊరు చెప్పండి sir

 2. sathish
  |

  ఆ మహాను భావుని పేరూ, ఊరు చెప్పండి sir

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...