ఒకప్పుడు పేపర్లు అమ్మింది – ఇప్పుడు IIT గ్రాడ్యుయేట్ అయింది

November 6, 2016

కష్టపడితే తప్పక ఫలితం ఉంటుంది అని చెప్పడానికి ఈ అమ్మాయి విజయమే ఒక తార్కాణం.
పేద కుటుంబం నుండి వచ్చి ఎంతో కష్టపడి ఐ ఐ టీ లో సీటు సాధించి ,
ఇప్పుడు ఉన్నత స్థానం లో నిలిచింది.

ok

వివరాల్లోకి వెళితే………

ఇక్కడున్న అమ్మాయి పేరు శివాంగి.
ఈమెది కాన్పూర్ కు అరవై కిలోమీటర్ల దూరంలోని దేహా అనే గ్రామం.

అక్కడే తన తండ్రితో పాటు ప్రతి రోజూ పేపర్లు , మ్యాగజైన్లు అమ్ముతూ ఉండేది.

ప్రభుత్వ స్కూల్ లో చదువుకుంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేది.
ఒకరోజు అనుకోకుండా ఆనంద్ కుమార్ నడుపుతున్న సూపర్ 30 విద్యా కార్యక్రమం గురించి తెలుసుకుంది.

పేద కుటుంబాలకు చెందిన పిల్లల్ని ఐ ఐ టీ ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతున్న కార్యక్రమం అది.
వెంటనే అతన్ని కలిసింది. ఆ కార్యక్రమానికి ఎంపికైంది.

ఎంతో కష్టపడి చదివి , రూర్కీలో ఐ ఐ టీ సీటు సంపాదించింది.

ఇప్పుడు ఐ ఐ టీ గ్రాడ్యుయేట్ గా మంచి కార్పోరేట్ ఉద్యోగాన్ని సాధించింది.
ఇప్పుడు తననే కాదు … తన కుటుంబాన్నీ పోషించే స్థాయికి వచ్చింది.

హ్యాట్సాఫ్ టు శివాంగి అని అందరిచేతా అనిపించుకుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...