ఒకటి కాదు , రెండు కాదు …… 300 జబ్బులను దూరం చేసే మునగాకు

October 27, 2016

మనలో చాలా మందికి మునక్కాయల గురించి తెలుసు. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య యోజనాలున్నాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది.

మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. మనం తినే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు వుండవు. అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి.

ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే,
ఆయుర్వేదంలో 300లకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు.

munagaaku

* మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఎని పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు.

* పాల నుంచి లభించే క్యాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది.

* పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు.

* అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు.

* మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్‌గా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది.

* థైరాయిడ్‌ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు.

* మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుందట.

* మునగాకుల రసాన్ని పాలలో కలపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి.

* గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు.

* పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి.

* గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.

* మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి.

* మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి.

* ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది.

ఇన్ని లాభాలున్న మునగాకును మీ వంటల్లో తప్పకుండా వాడండి ……….. ఆరోగ్యంగా ఉండండి.

1 Comment

on ఒకటి కాదు , రెండు కాదు …… 300 జబ్బులను దూరం చేసే మునగాకు.
  1. Mallikarjuna
    |

    Good

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...