ఏ దేవుడికి ఎలాంటి నైవేద్యం పెట్టాలంటే………….

November 15, 2016

ఏ దేవుడికి ఏ నైవేద్యం పెట్టాలో మీకు తెలుసా?

మనం సకల దేవతలను ఆరాధిస్తున్నాం. ఇష్టదైవాల్ని ఎన్నుకోవడం ఆయా భక్తుల అనుభూతులపై, మహిమలపై ఆధారపడి ఉంటుంది.

అష్టోత్తర సహస్రనామ అర్చనలు, షోడశోపచార పూజలు చేసిన తర్వాత ఇష్టదైవాలకు అవసర నైవేద్యం, మహానైవేద్యం, తాంబూల సమర్పణ, హారతి (నీరాజనం) మంత్రపుష్పం, తీర్ధస్వీకారం, ఫలశ్రుతి అనంతరం పూజ సమాప్తమగును. అయితే ఏ దేవుడికి ఏ నైవేద్యం పెట్టాలో మీకు తెలుసా అయితే ఇది చదవండి.
.
da

దేవతలకు సమర్పించవలసిన నైవేద్యాలు
విఘ్నేశ్వరునికి..
బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి.
.
శ్రీ వేంకటేశ్వరస్వామికి
వడపప్పు, పానకము, నైవేద్యం పెట్టాలి. తులసిమాల మెడలో ధరింపవలెను.
.
ఆంజనేయస్వామికి
అప్పములు నైవేద్యం, తమలపాకులతోనూ గంగసింధూరంతోనూ పూజించాలి.
.
లలితాదేవికి
క్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పానకము.
.
సత్యనారాయణస్వామికి
ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి కలిపి ప్రసాదము నైవేద్యం.
.
దుర్గాదేవికి
మినపగారెలు, అల్లం ముక్కలు, నైవేద్యం.
.
సంతోషీమాతకు
పులుపులేని పిండివంటలు, తీపిపదార్ధాలు.
.
శ్రీ షిర్డీ సాయిబాబాకు
పాలు, గోధుమరొట్టెలు నైవేద్యం
.
శ్రీకృష్ణునకు
అటుకులతోకూడిన తీపిపదార్ధాలు, వెన్న నైవేద్యం. తులసి దళములతో పూజించడం ఉత్తమం
.
శివునకు
కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా, మారేడు దళములు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి.
.
సూర్యుడుకు
మొక్కపెసలు, క్షీరాన్నము నైవేద్యం.
.
లక్ష్మీదేవికి
క్షీరాన్నము, తీపిపండ్లు, నైవేద్యం, తామరపూవులతో పూజించాలని పండితులు అంటున్నారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...