ఏయే ఆహార పదార్థాలను కలిపి తినకూడదంటే…………

September 21, 2016

కొన్ని పదార్థాలను కలిపి తింటే , మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం .
అందుకే ఈ ఆహార నియమాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించండి.

1. తేనే మరియు నెయ్యి కలిపి తినకూడదు. ఆ రెండిటి కలయిక విషపూరితం అవుతుంది.

2. పెరుగు లేక మజ్జిగను అరటి పండు తో కలిపి తినకూడదు.

3. అన్నాన్ని పండ్లతో (fruits) కలిపి తినకూడదు. అలా తినడం వల్ల పండ్లలోని మినరల్స్ తగ్గిపోతాయి.

4. కూరగాయలతో కలిపి వెన్న కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం.

food

5. చేపల కూర తిన్నవెంటనే పాలు కానీ, పెరుగు కానీ తినకూడదు. అలా తింటే కుష్టు రోగం వంటి దీర్ఘకాలిక జబ్బులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి.

6. లావుగా ఉన్నవారు బియ్యం తో వండినవి కాకుండా గోధుములతో చేసిన ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిది..

7. ఆస్తమా రోగులు టమోటా , గుమ్మడికాయ , ముల్లంగి లను, వారు తీసుకొనే ఆహారంలో వాడకూడదు. అలాగే వారు తల మీద ఎక్కువ తేమను కూడా ఉంచుకోవడం మంచిది కాదు.

8. మొలలు ఉన్నవారు గుడ్లు , మాంసం తినకూడదు.

9. నెయ్యిని రాగి పాత్రలో ఉంచి తినకూడదు.

10. పొద్దునే బెడ్ కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు. పొద్దునే మంచి నీరు తాగిన తర్వాత తాగొచ్చు.

11. అల్సర్ వ్యాదితో భాద పడుతున్నవారు కారాన్ని తినకూడదు.

12. చర్మ వ్యాధులు ఉన్నవారు పొట్ల కాయ , పల్లీలు , ఎండు చేపలు , చిక్కుడు కాయలు తినకూడదు.

13. నువ్వుల నునే తో గోధుమ కి చెందిన వంటల్ని చెయ్యకూడదు.

14. మోకాళ్ళ నొప్పులతో ఉన్నవారు మాంసం , గుడ్లు తో చేసిన వంటలు తినకూడదు. తింటే నొప్పులు ఎక్కువవుతాయి.

వీటిని వీలైనంత వరకు గుర్తుంచుకొని పాటించండి.. ఆరోగ్యం బాగా చూసుకోండి.

ఆరోగ్యమే మహా భాగ్యం కదా!!

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...