ఎయిడ్స్ కు మందు వచ్చేసింది – ట్రయల్ రన్ కూడా సక్సెస్

November 11, 2016

హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త.
హ్యూమన్‌ ఇమ్యూనో వైరస్‌ బారిన పడి సతమతమవుతున్న వారికి
కొత్త ఔషధం అందుబాటులోకి రాబోతోంది.

ఎయిడ్స్ ప్రాణాంతకమైన వ్యాధి, నివారణ ఒక్కటే మార్గం అనేది మనందరికీ తెలిసిన విషయమే.
అలాంటి ప్రాణాంతక వ్యాధికి మందును హైదరాబాద్‌లో కనుగొనబోతున్నారు.

పాము విషంతో చేసిన ఈ ఔషధం బాగా పనిచేస్తోందని ఇండియన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ సంస్థ ధ్రువీకరించింది. వైరల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో ఉపయోగించే ‘క్రొటాలస్.హరిడస్’ అనే హోమియో మందు ఎయిడ్స్ వ్యాధిని నియంత్రిస్తుందని తెలంగాణ ఆయుష్ వైద్యులు గుర్తించారు.

d5

హైదరాబాద్‌లోని ఆయుష్ విభాగం వద్ద బ్రెజిల్‌కు చెందిన ఒక రకమైన పాము విషంతో తయారుచేసిన మందు ఉంది. కామెర్ల వంటి పలు రోగాల నియంత్రణకు ఆ ఔషధాన్ని చాలాకాలంగానే వినియోగిస్తున్నారు. ఈ ఔషధం ఎబోలా వైర్‌సకు పనిచేస్తుందా? లేదా? అనే విషయాన్ని పరీక్షించి చెప్పాల్సిందిగా
ఐఐసీటీని ఆయుష్‌ అధికారులు కోరారు.

అయితే ఎబోలా వైర్‌సకు సంబంధించిన పూర్తి సాంకేతిక సమాచారం తమ వద్ద లేదని… దానికి దగ్గర పోలికలు ఉండే హెచఐవీపై ఈ ప్రయోగ పరీక్షలను నిర్వహించారు. ఈ ప్రయోగంలో హెచ్‌ఐవీ వైరస్‌ను పూర్తిస్థాయిలో నియంత్రిస్తుందని తమ పరిశోధనలో గుర్తించారు. ఈ మందు సామర్థ్యాన్ని హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఐఐసీటీ శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు.

అంతేకాదు ఈ ‘క్రొటాలస్.హరిడస్’ మందు పనితీరును పూర్తిస్థాయిలో పరీక్షించేందుకు గత ఆరు నెలలుగా హైదరాబాద్‌ రామంతపూర్‌లోని హోమియో ఆసుపత్రిలో సుమారు 3,900 మంది ఎయిడ్స్‌ బాధితులపై క్లినికల్‌ ట్రయల్‌ను నిర్వహిస్తున్నారు.

ఔషధాన్ని తీసుకుంటున్న వారికి ప్రతీ వారం ఎయిడ్స్‌ పరీక్షలను జరిపి సీడీ-4 సెల్స్‌ కౌంట్‌ ఆధారంగా ఔషధం మోతాదును నిర్ధారిస్తున్నారు. డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్లినికల్‌ పరీక్షల్లో.. మందు వాడుతున్న వారిలో సీడీ-4 (రోగనిరోధక శక్తిని పెంచే) సెల్స్‌ కౌంట్‌ పెరుగుతున్నట్టు గుర్తించారు.

అంతే కాదు.. వీరిలో సుమారు 13 మందిలో హెచ్‌ఐవీ వైరల్‌ లోడ్‌ జీరో అయినట్టు పరీక్షల్లో తేలిందని, ఇద్దరిలో ఎయిడ్స్ పూర్తిగా తగ్గిపోయిందని తెలిపాయి. ప్రస్తుతమున్న హోమియో మందులు ఎయిడ్స్ నియంత్రణలో 60 నుంచి 70 శాతం మాత్రమే ఫలితాలు ఇవ్వగలుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో నూటికి నూరు శాతం నియంత్రణ చేయగలిగే ఔషధం కోసం ఆయుష్ అధికారులు పరిశోధన చేశారు. ఐఐసీటీ శాస్త్రవేత్తలు ఈ మందును ప్రయోగాత్మకంగా పరీక్షించి… అది హెచ్‌ఐవీ వైరస్‌పై పనిచేస్తుందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఆయుష్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి వెల్లడించారు.

ప్రస్తుతం ఎయిడ్స్‌ రోగులకు అందిస్తున్న ఈ మందు ఖరీదు చాలా తక్కువ. ఒక్కో డోస్‌ సుమారు 50 పైసల నుంచి ఒక్క రూపాయిలోపుగానే ఉంటోంది. పేద రోగులకు ఈ మందు ఎంతగానో ఉపయోగపడనుంది.

ప్రస్తుతం జరుగుతున్న క్లినికల్‌ ప్రయోగాలపై మరింత స్పష్టత వచ్చిన తర్వాత
ఈ మందు వాడకంపై మెడికల్‌ బోర్డు ఓ నిర్ణయం తీసుకోనుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...