ఎత్తు పెరగాలనుకుంటున్నారా……… అయితే వీటిని తినండి

October 12, 2016

మనలో చాలా మంది ఎత్తు పెరగడం కోసం ఎన్నో పాట్లు పడుతూ అనేక కసరత్తులు చేస్తూ ఉంటారు. కానీ టీనేజీ దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. అయితే వయసు దాటిపోయినప్పటికీ కొందరు ఎత్తు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది అన్నిసార్లూ సరైన ఫలితాన్నివ్వకపోవచ్చు. అందుకే ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు.

ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉంది. ఎత్తు పెరగడానికి ఉపయోగపడే కొన్ని ఆహార పదార్థాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

etthu

1. సోయాబీన్: (SoyBean)
**********************
ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది. రోజు 50 గ్రాముల తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్భోహైడ్రేట్స్ అధిక స్థాయిలో ఉంటాయి.

2. బఠాని: (Peas)
*****************
బఠానిలు రోజు తీసుకోనడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ దీంట్లో అధికంగా ఉంటాయి.

3. పాలు: (Milk)
****************
రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో విటమిన్ బీ12, డీ తో పాటు కాల్షియం ఉంటుంది.

4. ఎర్ర ముల్లంగి: (Red Radish)
****************************
ఎర్రముల్లంగిని తరుచూ తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్‌లు అధికంగా ఉంటాయి.

5. బెండకాయ: (Lady Finger)
**************************
ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కురగాయ బెండకాయ. దీంట్లో విటమిన్లు, ఫైబర్, పిండిపదర్థాలు, నీరు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అంతే కాదు బెండకాయ తింటే తెలివితేటలు కూడా పెరుగుతాయి.

6. బచ్చలికూర: (Chinese Spinach)
******************************
ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. ఇది ఎక్కువ దక్షణ ఆసియాలో లబిస్తుంది. అంతే కాదు అక్కడే దీనిని ఎక్కువగా తింటారు. బచ్చలిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి.

7. అరటిపండు: (Banana)
*********************
బరువు పెరుగకుండా ఉండాలనుకుంటున్నవాళ్లు అరటిపళ్లకు చాలా దూరంగా ఉంటారు. నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉన్నాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగడంతో పాటు హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. అంతే కాదు అరటిపండు తినడం వల్ల వీర్యం కూడా బాగా ఉత్పత్తి అవుతుంది.

8. గ్రీన్ బీన్స్: (Green Beans)
*************************
ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండి పదార్థాలు బీన్స్‌లో పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...