ఎటువంటి వైద్య సలహాలకైనా సరే …….. ఈ నంబర్ కు ఫోన్ చేస్తే చాలు

November 25, 2016

దేశంలోని ప్రజలకు ఫోన్ ద్వారా వైద్యుల సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఏర్పాట్లు చేస్తోంది.

ఇందుకోసం ప్రయోగాత్మకంగా 1075 నెంబరుతో ఫోన్ సౌకర్యాన్ని కలిగించనుంది.
హిందీ,ఆంగ్లం, తెలుగు సహా 23 ప్రాంతీయ భాషల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఇందుకోసం కాల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తారు.

చిన్నచిన్న వ్యాధుల నివారణకే ఈ సేవలు పరిమితం చేయనున్నారు.
24 గంటల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
రిజిస్టరైన వైద్యులు సలహాలు ఇస్తారు.
తొలుత కేంద్ర కాల్ సెంటర్ లో 300 సీట్లు ఉంటాయి.
మూడేళ్ళలో వాటి సంఖ్యను 800లకు పెంచుతారు.

muo

మొదటి దశలో డాక్టరు చీటీ అవసరం లేకుండా కొనుగోలు చేయదగ్గ మందుల పేర్లనే సెల్ ఫోన్ కు పంపిస్తారు.ఆ తరువాత చీటీ రూపంలో పంపిస్తారు. వీటిని ఈ మెయిల్ రూపంలో కూడా పంపించే వీలుంది.

తొలుత పేర్లు నమోదు చేసుకున్న 500 మంది వైద్యులు సేవలు అందిస్తారు.
ఇందుకోసం కేంద్ర ఆరోగ్య శాఖ రెండు వారాల్లో టెండర్లు ఆహ్వానిస్తుంది.

అలాగే మద్యం, పొగాకు వంటి దురలవాట్లు మాన్పించడంపైనా సలహాలు ఇవ్వడానికి కూడా
కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది.

సేవలు ఎలా అందుతాయి అంటే ………..

…1075 నెంబరుకు ఫోన్ చేయగానే కాల్ సెంటర్ లోని వారు పేరు, సెల్ నెంబరు నమోదు చేసుకుంటారు.

….ఫోన్ ను మొదట నర్సింగ్/పారామెడికల్/శిక్షణలో ఉన్న వైద్యులకు కలుపుతారు.
వారు వ్యాధి, దాని నివారణ చర్యలపై వివరాలు తెలియజేస్తారు.

…తరువాత వైద్యునికి కలుపుతారు. వారు అన్నింటినీ పరిశీలించి మందులు సూచిస్తారు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...