ఎంత డబ్బు జమ చేస్తే ……. ఎంత పన్ను కట్టాలంటే …………

November 15, 2016

డబ్బు…….డబ్బు….. డబ్బు …… ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాల ఫలితంగా దేశ ప్రజలంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాట ఇదే. రూ.500, 1000 రద్దు చేయడంతో నగదు రూపంలో ఇప్పటివరకు దాచుకున్న డబ్బుని 2016 డిసెంబర్ 30 లోపు మార్చుకోవాలని ప్రభుత్వం చెప్పింది. అంతేగాక డబ్బుని బ్యాంకు ఖాతాలో జమా చేసేటప్పుడు కొందరికి ఆదాయపు పన్ను కట్ అవుతుందని ప్రకటించారు.

ఒకవేళ లావాదేవీల్లో ఏదైనా తేడా కనిపిస్తే 200 శాతం పెనాల్టీ పడుతుందని కూడా చెప్పారు. దీంతో ఎవరికి ఎంత పన్ను పడుతుందో అనే సందిగ్దత చాలా మందిలో నెలకొని ఉంది. కావున ఎంత డబ్బు జమా చేస్తే ఎంత పన్ను పడుతుందో మీకు తెలిపేందుకు కొన్ని వివరాలను ఇక్కడ ఇచ్చాము. ఒక్కసారి చదివి తెలుసుకోండి.

money

ఆదాయపు పన్ను శ్లాబుల వివరాలు :

1).2,50,000 వరకు – పన్నులేదు.
2).2,50,001 నుండి 3,00,000 వరకు – 10%.
3).3,00,001 నుండి 5,00,000 వరకు – 5,000 + 10%
4).5,00,001 నుండి 10,00,000 వరకు – 25,000 + 20%
5).10,00,000 పైన – 1,25,000 + 30%

ఒక ముఖ్యమైన గమనిక:

వార్షిక ఆదాయం మొత్తం రూ. 5 లక్షలు మించని వారికి చెల్లించవలసిన ఆదాయపు పన్ను నుండి
మరో రూ. 2 వేలు మినహాయింపు లభిస్తుంది.

2015 – 16 ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను గణన ఆదాయపు పన్ను చట్టం (1961)g ప్రకారం
2015-16 ఆర్థిక సంవత్సరం గణనలో తేది 01.04.2015 నుండి 31.03.2016 వరకు పొందిన జీతభత్యాలు ఆధాయముగా పరిగణించాలి. అదే విదంగా సేవింగ్స్ మరియు మినహాయింపులు పొందే సొమ్ము
ఈ కాలంలో చెల్లించినవి అయి ఉండాలి.
******************************************************

Section 87A ప్రకారం చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 5లక్షల లోపు ఉన్నవారికి
చెల్లించాల్సిన టాక్స్ లో రూ.2,000/- రిబేట్ కలదు.
* చెల్లించాల్సిన ఆదాయపు పన్ను పైన 3% (2+1)
ఎడ్యుకేషన్ సెస్ అదనంగా చెల్లించాలి.
******************************************************

ఆదాయముగా పరిగనించబడే జీతబత్యములు:

Pay, DA, HRA, IR, CCA, అలవెన్సులు, మెడికల్ అలవెన్సులు, అదనపు ఇంక్రిమెంట్ అలవెన్స్, సరెండర్ లీవు జీతం, పి.అర్.సి బకాయిలు, స్టెప్ అప్ ఎరియర్స్, సెలవు కాలపు జీతం, మొ. నవి ఆదాయంగా పరిగనించబడును.

ఆదాయముగా పరిగనించబడనిఅంశములు:

పదవి విరమణ తరువాత పొందే GPF/GIS/AP(TS)GLI లనుండి పొందే సొమ్ము మరియు నగదుగా మార్చుకున్న సంపాదిత సెలవులు, అర్దజీతపు సెలవుల పై వచ్చిన సొమ్ము, LTC పై పొందిన ప్రయాణ భత్యం, మెడికల్ రియంబర్స్మేంట్ మరియు GPF, AP(TS)GLI లలో అప్పుగా పొందిన సొమ్ము ఆదాయంగా పరిగణించరాదు.
******************************************************

HRA మినహాయింపు :

Section 10(13A) ప్రకారం క్రింది మూడు అంశంలలో ఏది తక్కువయితే
ఆ మొత్తము ఆదాయం నుండి మినహాయింపు పొందవచ్చును.
1. పొందిన ఇంటి అద్దె బత్యంమొత్తం
2. ఇంటి అద్దెగా చెల్లించిన మొత్తం – 10% మూలవేతనం
(రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం పెన్షన్ కి పరిగణించరు కనుక
డి. ఎ ను కలుపనవసరం లేదు)
3. 40% వేతనం ఇంటి అద్దె అలవెన్స్ (HRA) నెలకు 3,000/-
(సంవత్సరానికి సరాసరి 36,000/-) కన్నఎక్కువ పొందుతున్నవారు
మొత్తం HRA మినహాయింపు పొందాలంటే రశీదుDDO కు సమర్పించాలి.
చెల్లిస్తున్నఇంటి అద్దె 1లక్ష దాటిన పక్షంలో ఇంటి యజమాని PAN నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
సొంత ఇంట్లో నివాసముంటున్న వారికి HRA మినహాయింపు వర్తించదు.

******************************************************

మినహాయింపులు:

1.ఇంటి ఋణం పై వడ్డి (Section24):

ఇంటి ఋణం తో నిర్మించి స్వంతం గా ఉంటున్న వారికి ఋణం పై చెల్లిస్తున్న వడ్డి పై 2లక్షల వరకు మినహాయింపు కలదు. ఒక వేళ ఇల్లు బార్య మరియు భర్త ఇద్దరు జాయింటుగా ఋణం పొంది ఉంటె ఇద్దరికీ సమానం గా విభజించి ఒక్కొక్కరు గరిష్టంగా 2లక్షల మినహాయింపు పొందవచ్చు. ఇంటి ఋణం తీసుకున్న ఇంట్లో స్వయంగా నివసించకుండా కిరాయకు ఇచ్చినట్టయితే ఇంటి ఋణం పై వడ్డి పూర్తిగా మినహాయింపు కలదు, కాని వచ్చే కిరాయిని ఆదాయంగా చూపాలి.

2. ఉన్నత చదువుల కోసం విద్యాఋణం పై వడ్డి (80E):

Self, Spouse, Children ఉన్నత చదువుల కోసం విద్యాఋణం పై 2015-16 ఆర్ధిక సంవత్సరం లో చెల్లించిన వడ్డి మినహాయింపు కలదు. ఈ మినహాయింపు గరిష్టం గా 7 సం. లు వర్తిస్తుంది.

3.ఆదారపడిన వారు వికలాంగులయితే (80DD):

ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిపై ఆడరపడిన వాళ్ళలో వికలాంగులుంటె సెక్షన్ 80DD క్రింద మినహాయింపు కలదు.
80% కన్నా తక్కువగా వైకల్యం ఉంటె 75,000/- , 80% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. ఇందుకోసం సంబందిత అధికారులు జారిచేసిన సర్టిఫికేట్ పొంది ఉండాలి.

4.ఆదాయపు పన్ను చెల్లించె వ్యక్తీ వికలాంగులయితే (80U):

ఉద్యోగి స్వయంగా వికలాంగులైన పక్షంలో 80% కంటే తక్కువ వైకల్యం ఉంటె 75,000/-,
80% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. వైకల్య ద్రువీకరణ పత్రం సమర్పించాలి.

5.అనారోగ్యానికి చికిత్సకు అయిన ఖర్చు (80DDB):

ఉద్యోగి కాని తనమీద ఆడరపడిన వారు Cancer, Hemophilia, Talassemia, Neurological diseases మరియు Chronic renal Failure వంటివాటితో అనారోగ్యానికి గురయి చికిత్స కోసం చెల్లించిన సొమ్ములో 60 సంవత్సరాల లోపు వారికి 40,000/-, 60 సంవత్సరాలు లేదా పైబడిన వారికి 80,000/- మినహాయింపు కలదు. దీనికోసం ఫారం 10-I లో సంభందిత స్పెషలిస్ట్ డాక్టర్ చే ఖర్చుల వివరాలు సమర్పించాలి.కాని ఈ సెక్షన్ కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు.

6. చందాలు (80G) :

PM, CMరిలీఫ్ ఫండ్ వంటి 100% మినహాయింపు గలవాటికి ఇచ్చే చందాలు మినహా , 80G క్రిందకు వచ్చే 50%/30% మినహాయింపులోకి వచ్చే ఏ ఇతర చందాలు DDO లు అనుమతించరాదు.

******************************************************

* గమనిక: సెక్షన్ 80DDB మరియు 80G కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు. కాని ముందుగా February జీతం తో టాక్స్ చెల్లించి, అధికముగా చేల్లించిన మొత్తాన్ని31 జూలై 2016 లోపు Income Tax Department వారికి SAHAJ ఫారంలో సమర్పించిన తిరిగి చెల్లిస్తారని ఐ.టి. డిపార్ట్మెంట్ వారు గత సంవత్సరం DTA/DTO లకు సర్క్యులర్ రూపంలో ఆదేశాలు ఇచ్చినారు (vide E.No TDS/clarification/1011 Dt. 15/12/2011 of Addl. Commissioner IT Dept. Hyderabad) తిరిగి పొందవచ్చు.

******************************************************

మెడికల్ ఇన్సురెన్స్ (80D):

ఉద్యోగి తన కుటుంబంకోసం మరియు పేరెంట్స్ కోసం చెల్లించిన మెడికల్ ఇన్సూరెన్స్ వేరు వేరుగా మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి తన కుటుంబం కోసం చెల్లించిన సోమ్ముకాని గరిష్టంగా 25,000/- లు, ఉద్యోగి పేరెంట్స్ కి మెడికల్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించిన ప్రీమియం కాని గరిష్టంగా 25,000/- పేరెంట్స్ లో ఒక్కరు సీనియర్ సిటిజెన్ అయినా ప్రీమియం కాని గరిష్టంగా 30,000/- మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి కాని కుటుంబం కోసం కాని పేరెంట్స్ కోసం కాని హెల్త్ చెకప్ కోసం సొమ్ము ఉపయోగిస్తే ఈ సెక్షన్ కింద గరిష్టం గా 5,000/- మినహాయింపు కలదు.కన్వేయన్స్ అలవెన్స్ కి పూర్తిమినహాయింపు. వృత్తి పన్ను కు కూడాపూర్తిగా మినహాయింపు కలదు.

******************************************************
పొదుపు పథకాల పై మదుపు రూ. 1.5 లక్ష:

1.వివిధ పొదుపు పతకాలలో సేవింగ్స్ (80C):

GPF, ZPGPF, APGLI, GIS, LIC, PLI, National Saving Certificates, Public Provident Fund, Sukanya Samruddhi Yojana, ELSS, ULIPS మొదలయిన పతకాలలో చేసిన సేవింగ్స్, తన, స్పౌస్ ఉన్నత చదువుకోసం, ఇద్దరు పిల్లల వరకు ప్రీ స్కూల్ నుండి ఉన్నత చదువుల వరకు చెల్లించిన ఫీజు, ఇంటి ఋణం పై చెల్లించిన అసలు (Principle), ఇంటిని ఈ ఆర్ధిక సంవత్సరం లో కొన్నవారికి రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ రూ. 1.5 లక్ష వరకు మినహాయింపు కలదు.

2. Annuity సేవింగ్స్ పథకం లో సేవింగ్ (80 CCC):

LIC లేదా ఇతర ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ల ద్వారా తీసుకున్న ఆన్యుటి స్కీంల కోసం చేల్లించిన ప్రీమియం. 3.CPS deduction (80CCD) : కొత్త పెన్షన్ పై నియామకం అయిన ఉద్యోగులు ప్రతినెల తమ జీతం నుండి 10% చెల్లిస్తున్న CPS deduction 80CCD(1) ప్రకారం 1లక్ష వరకు మినహాయింపు కలదు . ప్రభుత్వం ఉద్యోగి ప్రాన్ ఖాతా లో జమ చేస్తున్న 10% CPS మ్యాచింగ్ గ్రాంట్ ని 80CCD(2) ప్రకారం జమయిన మొత్తాన్ని రూ.1.5 లక్షలకు అదనం గా మినహాయింపు కలదు.
80CCD(1B) తో 50,000/- అదనపు మినహాయింపు అవకాశం కల్పించారు ఈ సదుపాయం ఏప్రిల్ 2016 నుండి అందుబాటులోకి వస్తుంది.
* 80C, 80CCC, 80CCD ల పొదుపు ల పైన మొత్తముగా 1.5 లక్షలు ఉంటుంది.

3. అదనపు మినహాయింపు పొదుపు పథకం RGESS (80CCG):

Rajiv Gandhi Equity Saving Scheme ద్వారా 1.5లక్షలకి అదనముగా మినాయింపు ఇస్తుంది. వార్షిక ఆదాయము 10 లక్షలలోపు ఉన్నవారు గరిష్టంగా 50,000/- వరకు పొదుపు చెయవచ్చు. పొదుపు చేసిన సొమ్ములో సగం (50%) ను మినహాయిస్తారు అంటె గరిష్ట మినహాయింపు 25,000/- వరకు పొందొచ్చు.

సేవింగ్స్ ఖాతా పైన పొందిన వడ్డీ మినహాయింపు (80TTA):

సేవింగ్స్ ఖాతా లో జమయిన వడ్డీ ని ఆదాయం గా చూపిన దాంట్లో నుండి వడ్డీని గరిష్టం గా 10,000/- వరకు 80TTA ప్రకారం రూ. 1.5 లక్ష సేవింగ్స్ పై అదనముగా 10,000/- వరకు మినహాయింపు అవకాశం ఉంది.

ఈ విషయాన్ని అందరికి షేర్ చేయండి.
ఎవరు ఎంతెంత పన్ను చెల్లించాలో తెలిస్తే కాస్త అయినా ఊపిరి పీల్చుకుంటారు.

2 Comments

on ఎంత డబ్బు జమ చేస్తే ……. ఎంత పన్ను కట్టాలంటే ………….
  1. Subhash Vangari
    |

    Very nice & worth full information

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...