ఊపిరితిత్తుల జబ్బుల లక్షణాలను ముందుగానే తెలుసుకోవడం ఎలాగంటే………..

September 28, 2016

ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ………..
శ్వాస పీల్చుకోవడానికి అకస్మాత్తుగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారా…………?
అయితే దీనిని ఒక్కసారి చదవండి.

ఆస్తమా, సీవోపీడి , సిస్టిక్ ఫైబ్రోసిస్, బ్రాంకైటిస్ , ఎంఫసీమా వంటి శ్వాసకోశ జబ్బుల లక్షణాలు ఆరంభం కావడానికి ముందుగానే మనల్ని హెచ్చరించే “ వింగ్ “ అనే పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు.

సెన్సార్ తో కూడిన దీన్ని స్మార్ట్ ఫోన్ కు జోడిస్తే, యాప్ తో అనుసంధానమై పనిచేస్తుంది.
ఒక సెకను కాలంలోని మన ఉచ్చ్వాస నిశ్వాసాల గాలి పరిమాణాన్ని, వేగాన్ని ను కచ్చితంగా లెక్కించి ఊపిరితిత్తుల పనితీరును తెలుపుతుంది.

asthma

అమెరికాలోని స్పారో లాబ్స్ సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం………….

ఈ పరికరం ద్వారా ఎవరికివారే ఊపిరితిత్తుల పనితీరును తెలుసుకోవచ్చు.

దుమ్ము ,ధూళి , కాలుష్య కారకాలను ముందే గుర్తించడంతో పాటు, ఊపిరితిత్తుల కు కలిగే జబ్బుల లక్షణాలను ఆరంభం కావడానికి ముందే తెలుసుకోవచ్చు.

దీన్ని హెడ్ ఫోన్ జాక్ ద్వారా స్మార్ట్ ఫోన్ కు జోడించొచ్చు. ఇది ఫోన్ నుండే విద్యుత్ ను తీసుకుంటుంది కాబట్టి చార్జింగ్ , బ్యాటరీల వంటివేవీ అవసరం లేదు.

ఊపిరితిత్తుల పనితీరును గమనించడంతో పాటు ఆ సమాచారాన్ని రికార్డు చేసుకోవచ్చు మరియు డాక్టర్ కు పంపించుకోవచ్చు.

ప్రస్తుతం అమెరికాలోని ఎఫ్డీఏ సమీక్షలో ఉన్న ఈ పరికరం త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...