ఉల్లిపాయ వల్ల కలిగే 8 అద్భుత ఆరోగ్య లాభాలు తెలిస్తే ….. ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు

November 8, 2016

మనం నిత్యం వంటల్లో వాడే ఉల్లిపాయ ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగకరమైనది .
ఎన్నో రకాల జబ్బులను నివారించడంలో ఉల్లిపాయ అనేక విధాలుగా తోడ్పడుతుంది.

onions

ఉల్లిపాయను కట్ చేసే కాలి కింద పెట్టుకుని ,లేదా సాక్స్ వేసుకుని దుప్పటి కప్పుకుని
పడుకున్నట్టయితే జ్వరం తగ్గుతుంది.

కీటకాలకుట్టినచోట ఉల్లిపాయని కట్ చేసి ఆ ముక్కలతో రుద్దినట్టయితే దురద మంట తగ్గుతుంది.

కాలిన గాయలనుండి నొప్పి తగ్గించడం లో కాలిన చోట కమిలినట్టుగా ఉండి ఏర్పడిన మచ్చలను తొలగించడంలో ఉల్లిభాగా పనిచేస్తుంది.దీనికోసం ఉల్లిని రెండు ముక్కలుగా కట్ చేసి కాలిన చోట పెట్టాలి.
ఇలా చేయడం వల్ల గాయం మానిపోతుంది.

ఉల్లిపాయ రసం, తేనె రెంటినీ సమభాగాల్లో తీసుకుని బాగా గిలక్కొట్టి తాగితే గొంతునొప్పి, దగ్గు తగ్గిపోతాయి. ఇతర ఇన్ఫెక్షన్లను కూడా ఇది నివారిస్తుంది.

అజీర్తి వల్ల వాంతులు, విరోచనాలు వస్తే అరకప్పు ఉల్లిపాయరసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి అప్పుడప్పుడు తాగితే వాంతులు, విరోచనాలు తగ్గుముఖం పడతాయి.

చెవినొప్పి నివారణకు ఉల్లి బాగా పనిచేస్తుంది. చెవిలో ఏర్పడే గులిమి వలన చెవి నొప్పి,దురద ఉంటుంది.ఉల్లిపాయ తొక్కతీసి దానిని పేస్ట్ లా చేసి,ఆ పేస్ట్ ను నొప్పి ఉన్న ప్రదేశంలో పూసి, ఒక గుడ్డ చుట్టిఉంచడంవల్ల కూడా నొప్పి క్రమంగా నయమవుతుంది.

ఉల్లిపాయను నీళ్లలో వేడిచేసి ఆ నీటికి కొంచెం చక్కెర చేర్చి పిల్లలకు తాగిస్తే వారికి మంచి నిద్ర పడుతుంది. పిల్లల్లో పొట్టనొప్పి నివారించడానికి ఉల్లి మంచి దోహదకారి. అందుకు మనం చేయాల్సిందల్లా, కొంచెం నీళ్ళల్లో ఉల్లిపాయను వేసి ఉడికించాలి. ఆ ఉల్లినీటిని చల్లార్చి పిల్లలకు ఒక చెంచాడు తాగిస్తే తక్షణ రిలీఫ్‌ లభిస్తుంది.

ఉల్లిరసం తలకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. జుట్టులో ఉన్న ఫంగ్‌స్ ని ,చుండ్రును నివారించి తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది. అలాగే జుట్టు ఊడిపోకుండా కాపాడుతుంది

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...