ఈ IAS ఆఫీసర్ ఆలోచనకు , ఔదార్యానికి హ్యాట్సాఫ్

November 23, 2016

నిరుపేదలు, కూలీల ఆకలి బాధను తీర్చేందుకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ‘‘అన్నం పరబ్రహ్మ సహకార ఆహా రం’’! పథకానికి గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో కలిసి రూపకల్పన చేశారు.

నగరంలోని హోటళ్లు, ఫంక్షన హాళ్లలో మిగిలిన ఆహారాన్ని పారేయకుండా……
ఈ అభాగ్యుల, ఆపన్నుల ఆకలి ని తీర్చేందుకు అందించాలని కోరుతున్నారు.

amrapali-collector

ఈ పథకం కిం ద గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన పరిధిలో 9 ప్రాం తాల్లో ఆహార సేకరణకు ఏర్పాట్లు చేశారు. సేకరించిన ఆహారాన్ని భద్రపరిచేందుకు భారీ రిఫ్రిజిరేటర్లను కార్పొరేట్‌ సం స్థలు అందిస్తున్నాయి.

ఆహార నాణ్యతను ఫుడ్‌ ఇనస్పెక్టర్లు, కార్పొరేషన ఆరోగ్య అధికారి పర్యవేక్షిస్తారు. ఆహారా న్ని ప్యాకెట్లలో భద్రపరిచి వాటి మీద సేకరించిన తేదీని నమోదు చేస్తారు. పాడైపోయిన ఆహార పదార్థాలు ఇవ్వొద్దని దాతలకు కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమాన్ని ఈనెల 26న లాంఛనంగా ప్రారంభించనున్నారు.
పథకం అమలు తీరును బట్టి మార్పులు చేసే అవకాశం ఉందంటున్నారు.

ఎంజీఎం సెంటర్‌, హన్మకొండ బస్టాండ్‌, వరంగల్‌, కాజీపేట రైల్వేస్టేషన్లు, హన్మకొండ కలెక్టరేట్‌, పాలమూరు గ్రిల్‌ సెంటర్‌, పోచమ్మ మైదానతో పాటు మరో రెండు సెంటర్లలో ఏర్పాటు చేస్తారు.

పేదల ఆకలి తీర్చే ప్రయత్నం ఇది…..

‘‘కరెన్సీ సమస్యతో ప్రజలు ఇ బ్బంది పడకుండా వరంగల్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
నిరుపేదలు,కూలీలు ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఆహార నాణ్యత పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నాం. ఆహా రం పాడై పోకుండా రిఫ్రిజిరేటర్లలో భద్రపరుస్తున్నాం. పేదల ఆకలి తీర్చేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నాం’’

-జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...