ఈ మొక్కలను పెరట్లో పెంచితే ……….. దోమలు మీ ఇంట్లోకి అస్సలు రావు

November 20, 2016

దోమల నివారణకు కాయిల్స్, ఎలక్ట్రికల్ సాధనాలు వాడటం ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. మన పరిసరాల్లో లభించే ఇలాంటి మొక్కలను ఇంట్లో పెంచి దోమలను నివారిస్తే ఎంతో శ్రేయస్కరం.
ఈ మొక్కల ద్వారా ఆరోగ్యకరమైన ఇబ్బందులూ తలెత్తవు.

ఈ నేపథ్యంలో మన పెరట్లోనే కొన్ని మొక్కలు దోమల నుంచి ఏంచక్కా రక్షణ పొందొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో కాదు.. మన పరిసరాల్లోనే దొరికే మొక్కలు దోమల నిరవాణకు దోహదం చేస్తాయంటే కదూ.. ఆ మొక్కల విశేషాలు తెలుసుకుందాం.

nimmagaddi

నిమ్మగడ్డి :
******
పోయేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కల పత్రాల్లో సుగంధ నూనెలు వీటిని నుంచి తీసిన నూనెను అ నేక సౌందర్య లేపనాలు, సెంట్లు, సబ్బుల్లో ఉపయోగిస్తారు. ఈ మొక్క నూనె రాసుకుంటే దోమలు కుట్టవట. ఈ మొ క్కలను పెరట్లో పెంచడం వల్ల దోమల వ్యాప్తిని తగ్గించవచ్చు. ఇవి ఎక్కువగా ఏటవాలు కొండల్లో పెరుగుతాయి. వీటిలో సింబోపోగాన్ సిట్రేటస్, సింబోపోగాన్ నార్డస్

కుక్క తులసి :
***********
ఈ మొక్క నుంచి తీసే సుగంధ తైలాన్ని పిచికారీ చేయడం వల్ల దోమలు ఇళ్లల్లోకి రావు. అంతేగాక ఇంటి ఆవరణలో ఈ మొక్కలను పెంచినా దోమలు రావు. లామియేసి కుటుంబానికి చెందిన తులసి, గగ్గెర (సజ్జ), తమ్మి మొక్కలు విరివిగా పెంచి అరికట్టవచ్చు.

మాసపత్రి :
********
అస్టరేసి కుటుంబానికి చెందిన ధవనం, మాచిపత్రి అని పిలువబడే ఈ మొక్కలు సువాసన వీటి ఆకులను నలిపి తలుపులు, కిటికీలు మొదలగు ప్రదేశాల్లో వేస్తే దోమలు రావు.

నీలగిరి :
******
మిర్టేసి కుటుంబానికి చెందిన ఈ రకం మొక్కల్లో సు గంధ తైలాలు ఉంటాయి. ఈ మొక్కల ఆకులను నిప్పులపై వేసి పొగపెడ్తే దోమలురావు. అంతేగాక ఏ ఇతర కీటకాలు దరిచేరవు.

బంతిపూలు :
*********
అస్టరేసి కుటుంబానికి చెందిన టాజిటెస్ ప్రజాతి మొక్కలను అలంకరణ మొక్కలుగా వాడుతున్నాం. ఈ మొ క్కల నుంచి అనేక కీటకనాశనీలను తయారు చేస్తున్నారు. వీటికి దోమలను అరికట్టే స్వభావం ఉంది. ఈ మొక్కలను పెరట్లో పెం చితే దోమలు రావు. వీటిలో టాజిటెస్ లుసిడ ముఖ్యమైనవి.

వెల్లుల్లి :
*******
వెల్లులి మొక్కలను ఇంట్లో పెంచుకోవచ్చు. గడ్డలను ముక్కలు చేసి కిటికీలు, తలుపుల దగ్గర ఉంచడం లేదా దంచి తీసిన రసాన్ని ఇతర సుగంధ తైలాలతో కలిపి స్ప్రే చేస్తే రావు.

రోజ్ మేరీ :
********
ఈ మొక్కల్లో సుగంధ తైలాలు దోమలను అరికట్టే స్వభావం ఉంది. రోజ్‌మేరీ ఆయిల్‌ను నూనెలతో కలిపి శరీరానికి రాసుకుంటే కుట్టవు.

పూదీనా :
******
వెర్టనేసి కుటుంబానికి చెందిన మెంతా ప్రజాతి మొక్కలన్నీ సుగుంధ తైలాలను కలిగి ఉంటాయి. వీటిని మిఠాయిలు, ఇతర ఆహార పదార్థాలు, సబ్బులు, సెంట్లు మొదలగు వాటిల్లో వాడుతారు. ఈ మొక్కలను పెరట్లో పెంచితే ఇంట్లోకి దోమలు రావు.

లవంగం :
*******
మిర్టేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క పూమొగ్గలే వీటిలో సుగంధ తైలాలు అధికంగా ఉంటాయి. ఈ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచితే రావు.

మరి కొన్ని మొక్కలు ఏమిటంటే …..

గ్రామ శివార్లలో తీగగా పెరిగే కౌరవ పాండువల మొక్కల ఆకుల రసాన్ని శరీరానికి పూసుకుంటే దోమలు దరిచేరవు. అలంకరణ కోసం పెంచే తుజా జాతుల మొక్కలు సిడార్ నూనెను ఇస్తాయి. ఈ నూనె కల్గిన కీటకనాశినిని పిచికారీ దోమలు రావు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...