ఈ మూడూ వాడితే …….. ఖచ్చితంగా జుట్టు రాలిపోదు

November 20, 2016

జుట్టు రాలిపోయే సమస్య నుండి ఎలా బయట పడాలో …..
ఇది చదివి , పాటించండి.

1. వేపాకులు గుప్పెడు తీసుకుని, కాస్త నలగ్గొట్టి కప్పు నీళ్ళలో వేసి మరగపెట్టాలి.
పావు కప్పు వచ్చాక చల్లారాక,
వడకట్టి గోరువెచ్చగా వున్నప్పుడు తలకు పట్టించి కాస్త మసాజ్ చేసుకుని
గంట అయ్యాక తలకు స్నానం చెయ్యాలి(మంచి ఫలితంకొసం కుంకుడు కాయ రసం ఉపయోగించాలి).

hrf

2. 100 గ్రాముల కొబ్బరి నూనెలో 30 గ్రాముల నిమ్మరసం కలిపి
కేవలం నూనె మిగిలినంత వరకు మరిగించాలి.
తరవాత గొరువెచ్చగా(వేడిగా వున్నపుడు వేయరాదు) అయ్యాక 5 గ్రాముల ముద్ద కర్పూరం కలపాలి.
తరవాత తలకు పట్టించి కాస్త మసాజ్ చేసుకుని గంట అయ్యాక తలకు స్నానం చెయ్యాలి.
(మంచి ఫలితంకొసం కుంకుడు కాయ రసం ఉపయోగించాలి).

3. కలబంద గుజ్జు 200 గ్రాములు, నువ్వులనూనె 200 గ్రాములు, ఈ రెండూ కలిపి చిన్న మంటపైన
మరగబెట్టి కలబంద గుజ్జు నూనెలో మరిగేవరకు వుడికించి దించి వడపోసి చల్లరిన తరువాత ఒక
డబ్బాలో పెట్టుకుని రోజూ తలకు రాసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయ్.

పై పద్ధతులలో ఏదో ఒకటి 3 లేదా 4 సార్లు చేసేసరికే మంచి ఫలితాలు కనిపించాయని చెప్పారు.

చుండ్రు, జుట్టు రాలే సమస్య వున్నవారు పై వాటిని వాడి మీలా బాధపడే వారికి కూడా ఇదే సలహా
ఇవ్వాలని కోరుకుంటున్నాను.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...