ఈ గోమాత విగ్రహ విశిష్టత తెలుసుకుంటే ….. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు

October 31, 2016

ఓం నమఃశివాయ

ఇక్కడ ఫోటోలో మీరు చూస్తున్న గోమాత విగ్రహం కడపజిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి సమీపంలోని
ఉప్పరపల్లె లో ఉన్న నవ దేవాలయ ప్రాంగణం నారాయణాశ్రమంలో ఉంది.

మిగిలిన తొమ్మిది దేవతా మూర్తుల విగ్రహాలతో పాటు ఈ గోమాత విగ్రహానికి కూడా ప్రత్యేక ఆలయం ఉంది.

ఇక్కడున్న గోమాత విగ్రహానికి ఒక ప్రత్యేకత, విశిష్టత ఉంది. అదేమిటంటే……….

1-7

ఈ దేవాలయాల ప్రాంగణంలోనే ఒక గోశాల ఉంది. అక్కడ దాదాపుగా 200 గోవులకు పైగానే ఉన్నాయి.

అక్కడున్న మిగతా ఆలయాల మాదిరిగానే గోమాతకు కూడా ఒక ఆలయం నిర్మించాలని సంకల్పించిన
ఆశ్రమ నిర్వాహకులు , గోశాలలో ఉన్న ఒక గోవును పోలినట్లుగానే విగ్రహం ఉండాలని శిల్పాచార్యున్ని దేవాలయ ప్రాంగణంలోకే పిలిపించారు.

ఆయన గోశాలలో ఉన్న గోవులలో ఒక గోవును ఎంపిక చేసుకొని ,
దాని మాదిరిగానే విగ్రహం ఉండాలని , దేవాలయ ప్రాంగణంలోనే దీక్ష తీసుకొని,
గోవు యొక్క విగ్రహాన్ని అద్భుతంగా రూపొందించాడు.

ఈ విగ్రహం ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించే సమయంలో ఒక ఆశ్చర్యకర అద్భుతం జరిగింది.

ఖచ్చితంగా విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో…….
ఏ గోవును ఆధారంగా చేసుకొని శిల్పాచార్యుడు ఈ విగ్రహాన్ని రూపొందించాడో………..
ఆ గోవు ఉన్నట్లుండి ఆకస్మికంగా శివైక్యం పొందింది.

నాటి నుండి నేటి వరకు గోమాతకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు.

ఈ గోమాత ఆలయం ప్రక్కలోనే కాశీ నుండి తెచ్చి ప్రతిష్టించిన శివలింగం ఉంది.
ఇక్కడ భక్తులే స్వయంగా శివలింగాన్ని స్పర్శిస్తూ అన్ని రకాల పూజలూ చేసుకునే సదుపాయం కల్పించారు.

బిల్వవృక్షాల మధ్యలో ఎంతో శోభాయమానంగా ఉన్న ఈ శివ లింగాన్ని
ప్రతి నిత్యం అనేక మంది భక్తులు దర్శిస్తూ ఉంటారు.

ప్రతిరోజూ ఈ ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాలతో , ఆధ్యాత్మిక శోభతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...