ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు – డెంగ్యూ , మలేరియా దోమలను తరిమికొట్టడానికి ……

November 7, 2016

దోమ కాటు వల్ల వచ్చే జ్వరాలను తప్పించుకోవాలంటే ఇంట్లో దోమలను నివారించాలి.
కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలతో దోమలను చాలా వరకు నివారించవచ్చు…

doma

ఇంట్లో దోమల బాధ ఎక్కువగా ఉంటే టీ పొడిని ఒక పాత్రలో వేసి కాల్చితే
ఆ ఘాటుకు దోమలు దూరమవుతాయి.

పుదీనా ఘాటు వాసన దోమలకు పడదు.
అందుకే పుదీనా మొక్కను ఓ కుండీలో నాటి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఘాటుకు దోమలు పారిపోతాయి.

ఒక గ్లాసులో సగానికి నీళ్ళు పోసి అందులో నాలుగైదు కర్పూరం బిళ్ళలు వేయాలి.
గదంతా కర్పూరం వాసనతో నిండి ఆ వాసనకు దోమలు బయటకు పోతాయి.

దోమలను తరిమేందుకు ప్రత్యేకంగా కాయిల్స్‌ (రసాయనాలు లేకుండా) కూడా లభ్యమవుతున్నాయి.
వాటిని ఉపయోగించి చూడవచ్చు.

దోమ కుట్టిన చోట నొప్పి, దురదగా ఉన్న చోట వెనిగర్‌ అద్దిన దూదితో మృదువుగా రుద్దితే
సమస్య పరిష్కారం అవుతుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...