ఇవి పాటిస్తే చాలు ……… అందరికీ తప్పక మంచి జరిగి తీరుతుంది.

October 26, 2016

అందరూ తెలుసుకోదగ్గ విషయాలు
************************
తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.

గురువు ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.

భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.

diwali

పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.

అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.

నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.

తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.

ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అది మహాపాపం.

కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు.

తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు.

ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు.

శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు.

ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.

భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం.

చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు,
ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి తీసుకుపోవాలి.

ఉమ్మితో వేళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.

వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.

విష్ణు ఆలయంలో 4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి.

ఆలయంలో ఆత్మప్రదిక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు,
గుడి చుట్టూ ప్రదిక్షిణం మాత్రమే చేయాలి.

నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు.

శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు.
జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు.

సంధ్యా సమయంలో నిద్ర, తిండి, పనికిరాదు.

చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.

నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం మంచిది కాదు.

నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.

ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.

చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.

నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.

పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.

హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.

తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.

ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.

శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.

అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.

నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు.
అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.

ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.

భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.

పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం.

తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.

దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు.

దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.

కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు.
శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.

కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.

మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...