ఇలా చేస్తే చాలు ………… మీ పెంపుడు జంతువుల ప్రాణాలు కాపాడుకోవచ్చు

October 28, 2016

దీపావళికి అందరూ టపాసులు కాలుస్తూ ……….. కేరింతలు కొడుతూ ఉంటారు.

కానీ టపాసుల శబ్దాలకు పెంపుడు జంతువులు వణికిపోతూ అటూ ఇటూ భయంతో పరిగెడుతూ ఉంటాయి. కొన్నిసార్లు నిప్పు రవ్వలు తగిలి గాయపడుతుంటాయి కూడా.

dsc00907-copy

టపాసుల నుండి వచ్చే వింత వెలుగులకు , శబ్దాలకు దిక్కుతోచక కట్టేసిన చైన్ లను కూడా తెంపుకొని
ఎటో వెళ్ళిపోతాయి. ఎంతో ప్రేమగా పెంచుకున్న పెట్స్ కనిపించడం లేదంటూ వెతుక్కునే వారి సంఖ్య
ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది.

ఈ సూచనలు పాటిస్తే ……….. మన పెట్స్ ను కాపాడుకోవచ్చు

మీ పెట్స్ ను టపాసుల శబ్దాలకు దూరంగా , నిశ్శబ్దంగా ఉండే గదిలో ఉంచండి.
లేదా టీవీని గానీ మ్యూజిక్ ప్లేయర్ ను గానీ వాల్యూమ్ పెంచి పెట్టి
పెట్స్ ప్రక్కలో కూర్చొని నిమురుతూ ఉండండి.

వాటికి తగినంత ఆహారం , నీరు టపాసులు పేలక ముందే పెట్టండి.
ఒక్కసారి టపాసుల శబ్దం విన్నాయంటే , భయంతో ఉన్న పెట్స్ ఏమీ తినవు , త్రాగవు.

మండుతున్న టపాసుల నుండి వెలువడే పొగ పెట్స్ ఆరోగ్యానికి తీవ్ర హాని చేస్తుంది .
కాబట్టి గది తలుపులు , కిటికీలు మూసి ఉంచండి.

విపరీతమైన శబ్దాల కారణంగా పెట్స్ తీవ్ర ఆందోళన కు గురైతే
అకస్మాత్తుగా వాటి గుండె నిలిచిపోయే ప్రమాదం ఉంది కాబట్టి
సాధ్యమైనంతవరకు టపాసులు పేలేటప్పుడు వాటి ప్రక్కలోనే ఉండటానికి ప్రయత్నించండి.

టపాసులు పేలడానికి ముందుగానే పెట్స్ ను వాకింగ్ కు తీసుకెళ్ళండి.

టపాసులు ఉన్న బాక్స్ లను పెట్స్ కు దూరంగా ఉంచండి.

నీటితో నిండుగా ఉన్న బకెట్ ను అందుబాటులో ఉంచుకోండి.
పొరపాటున గాయాలు తగిలే అవకాశం ఉంది కాబట్టి పస్ట్ ఎయిడ్ కిట్ ను దగ్గరలో పెట్టుకోండి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...