ఇలా చేస్తే చాలు …………. నోటి దుర్వాసన పోతుంది

October 27, 2016

నోటి దుర్వాసన పోవాలంటే ………… ఏం చేయాలంటే …………

మనలో చాలా మంది వేళకు తినకుండా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ అటువంటిది.

అదే విధంగా కొందరు అరగని పదార్ధాలను, మాంసాహారాలను అతిగా సేవిస్తూ ఉంటారు.

noti-durvasana

అటువంటి వారికి అందరికీ జీర్ణక్రియ దెబ్బతిని, వాళ్ళు తిన్న ఆహారం మురిగిపోయి కుళ్ళిపోయి
పొట్టలోనే కంపుకొడుతూ ఆ దుర్గంధమంతా పైకి వచ్చి నోటి నుండి దుర్వాసనగా వెలువడుతుంటుంది.

మరికొంతమందికి భోజునం తరవాత మంచినీటితో పుక్కిలించే అలవాటు లేకపోవడంవల్ల పళ్ళసంధుల్లో ఇరుక్కున్న ఆహారపు తునకలు కొంతసేపటికి కుళ్ళిపోయి కంపుకొడుతూ నోట్లో దుర్వాసనను పుట్టిస్తూ ఉంటాయి.

నోటి దుర్వాసనకు ఇవే ముఖ్యమైన కారణాలు కాబట్టి,

అలాంటి వారు తమ తప్పులను తెలుసుకుని రోజూ ఉదయం 9 గంటలలోపు మొదటి భోజనం,
రాత్రి 8 గంటలలోపు రెండవ భోజనం,మధ్యాహ్నం అల్పాహారం క్రమంతప్పకుండా సేవించడానికి అలవాటుపడాలి.

భోజనం చేసిన తరువాత మరచిపోకుండా
పదిపన్నెండుసార్లు నోటినిండా నీళ్ళు పోసుకుని నిదానంగా బాగా పుక్కిలించి ఊసివేయాలి.

ఆ తరువాత ఒక్క లవంగాన్ని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తుంటే దుర్వాసన హరించి నోరు సుంధభరితమౌతుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...