ఇలా చేస్తే చాలు ……………తెల్ల జుట్టు తప్పకుండా నల్లగా మారుతుంది

October 28, 2016

చిన్నవయసులోనే కొంతమంది యువతీయువకులకి తలలో తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి. ఇలాంటి వాళ్ళు నలుగురితో కలిసి తిరగాలన్నా బాగా మొహమాటపడతారు. తమ వెంట్రుకల రంగు చూసి ఎవరు నవ్వుతారో అని చాలా ఇబ్బందిపడుతుంటారు.

చిన్నతనంలోనే తెల్ల వెంట్రుకలు రావడానికి……….
సరైన పోషకాహారం తీసుకోకపోవడం, తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవనశైలి అనేవి ముఖ్య కారణాలు.

మన ఇంట్లో ఉండే వస్తువులతో తెల్లజుట్టు సమస్యను అధిగమించవచ్చు.

hair

ఎలాగంటే……

100 మిల్లీ గ్రాముల కొబ్బరినూనెలో గుప్పెడు కరివేపాకు ఆకులు వేయాలి.
ఆ రెండింటిని కలిపి బాగా ఉడకబెట్టాలి.
కరివేపాకు ఆకులు నల్లరంగులోకి మారిన తర్వాత దానిని పొయ్యి మీద నుంచి దించాలి.
అది చల్లారిన తర్వాత దాన్ని బాగా పిండి………..
అందులోంచి వచ్చిన ఆయిల్‌ని ఒక సీసాలో పోసి గట్టిగా మూతపెట్టాలి.
ఈనూనెను ప్రతి రోజూ రాత్రిపూట తలకు రాసుకుని 20 నిమిషాలు పాటు మర్దనా చేసుకొని,
ఆ మర్నాడు తలస్నానం చేయాలి.

అలాగే…..

జుట్టును నల్లగా ఉంచడంలో ఉసిరి, నిమ్మ కూడా ఎంతో బాగా పనిచేస్తాయి.

ఒక టీ స్పూన్‌ ఉసిరిపొడిని కప్పు నీళ్లల్లో కలిపి స్టవ్‌పై పెట్టి అది సగానికి వచ్చేవరకూ ఉడకనివ్వాలి.
తర్వాత దానిని స్టవ్‌ మీద నుంచి దించి అందులో మూడు టీస్పూన్ల నిమ్మరసాన్ని కలపాలి.
ఈ మిశ్రమానికి కొంత నీరు కలిపి తలకు బాగా రుద్దుకుని నీళ్లతో కడిగేసుకోవాలి.

అలాగే నువ్వుల నూనె కూడా జుట్టు నల్లగా నిగ నిగ లాడేలా చేస్తుంది.
వంద మిల్లీగ్రాముల నువ్వుల నూనె, 100 మిల్లీ గ్రాముల కమలాపండు రసం, 50 గ్రాముల మెంతుల పొడిని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు వారాల పాటు సూర్యరశ్మి కింద ఉంచాలి.
ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు పెట్టుకుంటే జుట్టుకున్న తెల్లదనం పోతుంది.

హెన్నాతో సైతం ఈ సమస్యను అధిగమించవచ్చు. హెన్నా పొడిని పేస్టులా చేసి అందులో కాస్తంత కాఫీ పొడి, ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగు, ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం వేసి బాగా కలపాలి.
ఆ పేస్టును తలకు రాసుకుని రెండు గంటల సేపు అలానే ఉంచుకోవాలి.
ఆ తర్వాత షాంపుతో తలరుద్దుకుని, నీళ్లతో జుట్టును శుభ్రంగా కడిగేసుకోవాలి.

ఉడకబెట్టిన తేయాకు ఆకులతో వెంట్రుకల తెల్లదనాన్ని పోగొట్టుకోవచ్చు.
తొలుత తేయాకు ఆకుల్ని నీళ్లల్లో ఉడకబెట్టాలి.
అది చల్లారిన తర్వాత ఆ ఆకుల్ని పిండి దాని నుంచి వచ్చే నీటిని తలకు రాసుకోవాలి.
అలా రాసుకున్న తర్వాత గంటకు చల్లటి నీళ్లతో జుట్టును శుభ్రంగా కడిగేసుకోవాలి.
తలకు షాంపును మాత్రం పెట్టుకోవద్దు.

ఈ చిట్కాలు మీరూ ప్రయత్నించి చూడండి…
మీ తెల్ల జుట్టును నల్లగా నిగనిగలాడేట్టు చేసుకోండి…

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...