ఇక కార్లను టోల్ గేట్ దగ్గర ఆపాల్సిన పనిలేదు…… ఎందుకంటే …… ?

November 23, 2016

500 , 1000 నోట్ల రద్దు ప్రభావం వాహనాలపై పడింది. ముఖ్యంగా టోల్ గేట్ల ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. చిల్లర లేక టోల్ ట్యాక్స్ చెల్లించలేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యంగా కార్ల వినియోగదారుల టోల్ గేట్ కష్టాలకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం.
కార్లను టోల్ గేట్ల దగ్గర ఆపాల్సిన అవసరం లేకుండానే… వెళ్లవచ్చు.
అలాగని ట్యాక్స్ చెల్లించవద్దని కాదు.
ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే మొత్తం చెల్లింపు అంతా అయిపోతుంది.

car-tollgate

అందుకోసం కొత్తగా వస్తున్న కార్లకు డిజిటల్ ఐడెంటిటీ ట్యాగ్ తప్పనిసరిగా అమర్చాలని కేంద్ర ప్రభుత్వం వాహన తయారీ సంస్థలను ఆదేశించింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) ట్యాగ్ లు అమర్చిన కార్లు వస్తుంటే టోల్ ప్లాజాల దగ్గర ఉండే రీడర్లు వాటిని ముందుగానే గుర్తిస్తాయి.

దీంతో ప్రీపెయిడ్ విధానంలో ఆ కారు యజమాని ముందుగా జమచేసిన మొత్తం లోంచి ఆ టోల్‌గేటుకు ఎంత కట్టాలో ఆ మొత్తం కట్ అవుతుంది. దాంతో.. ఇక కారు ఆగాల్సిన అవసరం లేకుండానే గేటు ఓపెన్ అవుతుంది. ఎప్పటికప్పుడు రీచార్జి చేసుకుంటే సరిపోతుంది.

చాలా దేశాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఈ విధానాన్ని మన దేశంలో కూడా అమలు చేయాలనే
యోచనలో ఉంది కేంద్రం.

రూ.500,రూ.1000 రద్దు చేసినట్లు ప్రకటించిన ప్రధాని… తర్వాత వీలైనంత వరకు నగదు రహిత చెల్లింపులు ఉండాలని సూచించారు. వీటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నట్లు…టోల్ ప్లాజాల దగ్గర భారీ క్యూలను తగ్గించేందుకు వీలుగా ఈ టెక్నాలజీని అమలు చేయాలని కేంద్ర రవాణ మంత్రిత్వశాఖ వాహన కంపెనీలకు సూచించింది.

రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) ట్యాగ్ లను అమర్చడం ద్వారా కార్లు టోల్ ప్లాజాల దగ్గర ఆగాల్సిన అవసరం లేకుండానే వెళ్లవచ్చని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...