ఇంట్లో ఉండి …….. డోర్ తీయకుండానే , బయట ఎవరున్నారో…… స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం ఎలాగంటే…….

November 2, 2016

మీరు ఇంట్లో నిద్ర పోతున్నప్పుడు గానీ లేదా ఏదైనా పని మీద ఉన్నప్పుడు గానీ ,
ఎవరైనా వచ్చి కాలింగ్ బెల్ నొక్కితే , డోర్ దగ్గరకు వెళ్ళి తీయకుండానే
ఎవరు వచ్చారో లోపలినుండే స్మార్ట్ ఫోన్ ద్వారా చూడవచ్చుననే విషయం
మీకు తెలుసా………….?

అవును ………..ఇది అక్షరాలా నిజం.
డోర్ తీయకుండానే బయట ఎవరున్నారో ఫోన్ లో చూసేయొచ్చు.

untitled-chu-copy

అదెలాసాధ్యమంటే………….. “ పీబుల్ “ అనే చిన్న పరికరం ద్వారా.

గుండ్రని విక్స్ డబ్బా పరిమాణంలో ఉండే పీబుల్ ను
ప్రధాన ద్వారానికి ఉన్న పీప్ హోల్ కు పెట్టేస్తే చాలు ….
మీ స్మార్ట్ ఫోన్ లో ఎవరొచ్చారో చూసేయవచ్చు.

అలాగే బయటకి వెళ్ళినప్పుడు కూడా…….. మన ఇంటికి ఎవరొచ్చి వెళ్ళారో చూడొచ్చు.

ప్రధాన ద్వారం వద్ద ఏ మాత్రం అలికిడి అయినా ………..
మనిషి జాడ కనపడినా వెంటనే ఫోన్ కు మెసేజ్ పంపిస్తుంది.

తర్వాత కావాలనుకుంటే ఎవరొచ్చారో మనం లైవ్ లో చూసేయవచ్చు.

వైఫై ఆధారంగా పనిచేసే పీబుల్ లైవ్ ఫీడ్ ను నేరుగా మన స్మార్ట్ ఫోన్ కు పంపేయగలదు.
పొరపాటున డోర్ తెరిచి ఉంచినా అలర్ట్ చేస్తుంది.

టేక్సాస్ లోని ఆస్టిన్ కు చెందిన క్రిస్ చటర్ దీన్ని రూపొందించారు.
వినూత్న ఆవిష్కరణగా బ్రిటన్ కు చెందిన జేల్యాబ్ ఇనీషియేటివ్ అవార్డును కూడా పొందింది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...