ఆ ఆలయంలో దొరికిన రాగిరేకులో ఎంత అద్భుతం ఉందంటే…….

November 3, 2016

ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నది………..
కాశ్మీర్ లో ఒకప్పుడు అత్యంత సుందరం గా శోభిల్లిన మార్తాండ సూర్య దేవాలయం .
ఆ ఆలయం యొక్క విశిష్టతను ఒక్కసారి చదవండి.

201-copy-copy

( 1 ) మార్తాండ ఆలయం కూలగొట్టబడక ముందు ఎలా ఉండేది అన్న ఊహా చిత్రం .

( 2 )1868 లో జాన్ బుర్కే అనే బ్రిటీషర్ తీసిన ఫోటో

( 3 ) ప్రస్తుతం మార్తాండ సూర్య దేవాలయం యొక్క ఫోటో

కాశ్మీర్ లోని మార్తాండ సూర్య దేవాలయాన్ని రాజా బుల్నాట్ అనే రాజు నిర్మించారు.
ఆకాలంలో ఆలయం ఎంతో శోభాయమానంగా విరాజిల్లింది.

ఆ విధంగా ఎంతో ప్రశస్తి చెందిన ఆ ఆలయాన్ని సికిందర్ అనే రాజు
తన సైనికుల చేత ధ్వంసం చేయించాడు.

దాదాపుగా 13 నెలల పాటు సైనికులంతా కలిసి ఎంతో కష్టపడితే,
డెబ్బై శాతం ఆలయాన్ని మాత్రమే కూలగొట్టగలిగారు.

అంటే…….ఆ ఆలయాన్ని ఎంత పటిష్టంగా నిర్మించారో మనకు అర్థమవుతోంది.
చివరికి…. ఎలాగైనా ఆలయాన్ని పూర్తి నాశనం చేయాలని , మిగిలిన భాగానికి భారీగా నిప్పు పెట్టారు.

అలా……ఆలయాన్ని ధ్వంసం చేసే క్రమంలో అక్కడి సైనికులకు భూగర్భంలో ఒక రాగి ఫలకం దొరికింది.

ఆ రాగి ఫలకంలో “ రాజా బుల్నట్ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ జీవిత కాలం రాజు తెలుసుకోగోరి , ఆస్థాన జ్యోతిష్కులను అడుగగా………వారు ఈ ఆలయం నిర్మించిన 1100 సంవత్సరాల తర్వాత సికిందర్ అనే పేరు గల రాజు చేతిలో ఇది ధ్వంసం అవుతుంది “ అని రాసి ఉంది.

దీనిని చదివించుకున్న సికిందర్ ఈ ఆలయం ధ్వంసం విషయాన్ని అంత కచ్చితంగా చెప్పిన అప్పటి జ్యోతిష్యుల పరిజ్ఞానానికి , నైపుణ్యానికి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు.

ఈ రాగి ఫలకం విషయం తనకు ముందే తెలిసి ఉంటే , ఈ ఒక్క ఆలయాన్ని కూలగొట్టకుండా ఉండి , భారతీయుల యొక్క ఈ శాస్త్రం తప్పని నిరూపించే వాడిని అని
సికిందర్ తన సైనికులతో వాపోయాడని చరిత్ర కారులు అంటారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...