ఆధార్ కార్డు సమస్యలకు కొత్త హెల్ప్ లైన్ నంబర్

November 17, 2016

ఆధార్ కార్డులో సమస్యలు ఉన్నాయా………అయితే ఆధార్ కార్డు సమస్యలకు చెక్ పెట్టేందుకు
సరికొత్త టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తెచ్చింది యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ).

ప్రజలకు సులభంగా గుర్తుండేలా 1947 అనే నెంబర్ ను ఇకపై ఆధార్ హెల్ప్ లైన్ సెంటర్ టోల్ ఫ్రీ కోసం వినియోగించనున్నటట్టు యూఐడీఏఐ సీఈవో డాక్టర్ అజయ్ భూషణ్ పాండే ప్రకటించారు. భారత్ స్వాతంత్ర్యం పొందిన యేడాదినే హెల్ప్ లైన్ నెంబర్ గా ఇకపై వాడుకలోకి తెస్తున్నట్టు ప్రకటించారాయన.

aadhar

అన్ని సేవలకు ఆధార్ తప్పనిసరి. ఇందుకోసం ఐవీఆర్ఎస్ హెల్ప్‌లైన్ కోసం 1800-300- 1947 అందుబాటులోకి తెచ్చింది యూఐడీఏఐ. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ పనిచేస్తుంది.

ఆదివారాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సగటున ఈ హెల్ప్‌లైన్ నెంబరు రోజుకు లక్షన్నర వరకు ఫిర్యాదులు స్వీకరించగలమని తెలిపారు ప్రాజెక్టు డైరెక్టర్ అజయ్.

ఆధార్ నమోదు కేంద్రం దగ్గరలో ఎక్కడుంది, ఆధార్ నెంబరు జనరేషన్ స్టేటస్ వంటి సమస్యలను మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి 1947కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా వ్యక్తులు తమ కార్డు పోగొట్టుకున్నా వాళ్ల పుట్టిన తేది, పేరు, పిన్ కోడ్ చెప్పి తమ ఆధార్ వివరాలు హెల్ప్‌లైన్ ద్వారా పొందచ్చు.

ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది యూఐడీఏఐ. వాటిని ఇతరులు సులభంగా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని తెలిపింది. జిరాక్సు ఇచ్చేటప్పుడు అది ఎందుకిస్తున్నారో కాపీలో రాయాలని తెలియజేసింది.

జిరాక్స్ లో సంతంకతోపాటు డేట్, టైమ్ రాస్తే ఆ కాపీని వేరే వాళ్లు దుర్వినియోగం చేయడానికి వీలుపడదన్నారు అజయ్ భూషణ్

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...