ఆధార్ కార్డు పోతే………… తిరిగి కొత్తది ఎలా పొందాలంటే………….
ఆధార్ కార్డు పోయిందా…………. అయితే ఇలా చేయండి .
***********************************************
ప్రస్తుతం వివిధ అవసరాలకు ఆధార్ కార్డును తప్పనిసరిగా కావాలంటున్నారు.
అలాంటి కార్డును ఎక్కడైనా పొరపాటున పోగొట్టుకున్నా ……….. లేదా
ఎవరైనా చోరీ చేసినా చాలా టెన్షన్ పడాల్సిన పరిస్థితి వస్తుంది.
ఏం చేయాలో అర్థం కాక చాలామంది గాభరా పడుతుంటారు.
మళ్ళీ వాటిని తిరిగి పొందటం ఎలా అన్న సందేహం ప్రతి ఒక్కరికీ ఉంటుంది.
దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
కొన్ని పద్ధతులు పాటిస్తే , పోయిన కార్డుకు బదులుగా నకలు కార్డు ( డూప్లికేట్ ) పొందవచ్చు.
పోయిన ఆధార్ కార్డు తిరిగి పొందే విధానం :
*******************************
ఆధార్ కార్డు పోతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 18001801947 కు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి.
దీనికి ఎటువంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు.
కార్డును ఇచ్చిన అడ్రసుకు పోస్టులో పంపిస్తారు.
దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి కార్డు నంబరు , వివరాలు అందజేస్తే ,
దానికి అనుసంధానించిన ఫోన్ నంబర్ ఆధారంగా కలర్ ప్రింట్ తీసి ఇస్తారు.
ఇది పూర్తి స్థాయిలో చెల్లుబాటు అయ్యే విధంగా వినియోగించుకోవచ్చు.
లేదా [email protected] వెబ్ సైట్ లో పూర్తి సమాచారం పొందవచ్చు.
2 Comments
Leave a Comment
Brother you are doing a great and very very good help to others.All Madhavas are around you only because you are doing Manavaseva.lf possible I will meet you soon.
SURE AND THANKS ANDI