అసిడిటీని సులువుగా తగ్గించుకోండిలా……………..

October 7, 2016

ఇంట్లో వుండే ఔషధాలను వాడి అసిడిటి మరియు గ్యాస్ కొంత తగ్గించుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు.

అవేమిటంటే……

gas-acidity

తులసి….
**********
ఇండియాలో సాధారణంగా తులసి అంటే అందరికి తెలిసిందే, అసిడిటీకి ఇది ఒక మంచి ఔషదం.
వైద్య విలువలు కలిగి ఉన్న ఈ తులసి ఆయుర్వేద మందుల తయారీలలో కూడా వాడుతున్నారు.

భోజనానికి ముందుగా తులసి ఆకులను నమలటం వలన అజీర్ణానికి సంబంధించిన సమస్యలు తోలగిపోతాయని నిపుణులు తెలుపుతున్నారు.

పుదీన…..
**********
పుదీన కుడా అసిడిటీకి చికిత్సగా వాడతారని అందరికి తెలిసిన విషయమే.
ఉదయాన కడుపు కాలిగా ఉన్నపుడు పుదీన ఆకులను నమలాలి.
ఇలా ఒక నెల రోజుల పాటు చేయటం వలన అసిడిటీ పూర్తగా విముక్తి పొందుతారు. మరియు మీ భోజనం తరువాత ఒక గ్లాసు పుదీన రసం తాగటం వలన, మీరు అజీర్ణ సమస్యల నుండి విముక్తి పొందే అవకాశం ఉంది.

కొబ్బరి నీరు….
*************
కొబ్బరి నీరు అన్ని రకాలుగా ఆరోగ్యానికి మంచి చేస్తుంది.
ఖాళీ కడుపుతో కొబ్బరి నీరు తాగటం వలన ఇది అసిడిటీ కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తుంది.

కొబ్బరి నీటిని భోజన సమయంలో ఒలిచిన దోసకాయతో కలిపి కుడా తీసుకోవచ్చు.
ఇలా తాగిన 15-20 నిమిషాల తరువాత భోజనం తీసుకోవటం వలన ఇది అసిడిటీకి వ్యతిరేఖంగా పనిచేస్తుంది.

సంత్ర పండ్ల రసంతో జీలకర్ర…
**********************
ఒక గ్లాస్ తాజా సంత్ర పండ్ల రసాన్ని తీసుకొని, మరియు దీనికి కాల్చిన జీలకర్రని కలపండి.
ఈ మిశ్రమాన్ని మొదట అసిడిటీ వచ్చినపుడు తాగండి మీరు త్వరగా ఉపశమనాన్ని పొందుతారు.
దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు ఈ మిశ్రమాన్ని వరుసగా వారం రోజుల పాటు తాగండి.

ఆపిల్ సైడర్ వెనిగర్….
******************
అసిడిటీని త్వరగా మరియు సులభంగా తగ్గించుకోటానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక మంచి ఔషదం. త్వరగా ఉపశమనం కొరకు 2-3 చెంచాల వెనిగర్’ని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని తాగండి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...