అసలు డిల్లీకి ఏమైంది ….. ? ఇది కొత్త తరహా ఉగ్రవాదమట

November 8, 2016

అసలు డిల్లీకి ఏమైంది………?
ఒక్కసారిగా ఎందుకంతలా కాలుష్యం కమ్మేసింది ….. ?
ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ.

ఢిల్లీలో కాలుష్యం ఎంతలా విజృంభిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

idelhi

దుమ్ము..ధూళి, దట్టమైన పొగధూళితో ఆకాశ వీధులను కమ్మేస్తోంది.
ఎంతలా అంటే కళ్లు పాడైపోతాయన్న భయంతో రంజీ క్రికెట్ మ్యాచ్ రద్దయ్యేంతలా..
స్కూళ్లు మూతపడేంతలా.

ఈ ఢిల్లీ కాలుష్యంపై బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఉగ్రవాదం ఒకటని,
అది ఒకెత్తైతే ఈ ఢిల్లీ కాలుష్యం మరో రకమైన ఉగ్రవాదమని వ్యాఖ్యానించాడు.

రోజు..రోజుకు ఢిల్లీలో వాతావరణం మరింత క్షీణించిపోతోందని,
దీనిని ఇప్పుడే అడ్డుకోవాలంటే దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని,
అసలు ఈ కాలుష్యానికి కారణమైన మూల కారణాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందని అన్నారు.

దీని వెనక ఎవరున్నారో అందరికీ తెలుసని, ఇది కొత్త రూపంలో ఉన్న ఉగ్రవాదమని ఆయన అన్నారు.

వాస్తవానికి కశ్మీర్ లోయలో పాఠశాలలను తగులబెట్టడంపై మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అవివేకులే ఇలా స్కూళ్లను తగులబెడతారని, పిల్లలు బడికెళ్లి చదువుకోవడం ఇష్టం లేని వాళ్లు, వారిని నిరక్షరాస్యులుగా మార్చి తుపాకి చేతబట్టించి ఉగ్రవాదులుగా మార్చాలనుకునేవాళ్లే ఇలాంటి చర్యలకు పూనుకుంటారని అన్నారు. ఈ సందర్భంలోనే ఢిల్లీ కాలుష్యం గురించి మాట్లాడిన అనుపమ్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...