అజీర్తి తగ్గడానికి ఇంటి వైద్యం

October 12, 2016

మనుషులకు వచ్చే అన్ని వ్యాధులకు మూలం అజీర్తి అని చెప్పవచ్చు.

శరీర తత్వానికి విరుద్ధ ఆహారపదార్థాలు తీసుకోవడం, శరీర తత్వానికి మించి నీరు తాగడం,
రుచిగా ఉన్న ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవడం, కొన్ని రకాల వ్యాధుల వలన విరుద్ధ లక్షణాలు కలిగిన ఆహార పదార్థాలను కలిపి ఆహారంగా తీసుకోవడం వలన, రాత్రి సమయంలో ఎక్కువ ఆహారం.. సూర్యాస్తమయం జరిగిన సమయానికి 2 గంటల కంటే కూడా ఎక్కువ సమయం అయిన తర్వాత
ఆహారం తీసుకోవడం వల్ల అజీర్తి వ్యాధి తలెత్తుతుంది.

ajeerthi

ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే…

కడుపునొప్పి, గొంతులో పుల్లటి త్రేన్పులు మంటలు రావడం, అతిగా ఆకలి కావడం, తల తిరగడం,
కడుపు ఉబ్బరంగా ఉండటం, ఆకలి లేకపోవడం, అధిక దాహం ఉండటం

ఆయుర్వేద చికిత్స…

ఆహారానికి 30 నిమిషాల ముందు దాల్చిన చెక్క నమలి, ఒక కప్పు మజ్జిగ త్రాగాలి.
4 చెంచాల పుదీన రసం ఉదయం, సాయంత్రం ఆహారానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి.

ఈ అజీర్తి ఏ సమయంలో జరిగిందో గుర్తు చేసుకుని ఆ సమయానికి ముందు తీసుకున్న ఆహారం, లేదా నీరు, శీతల పానీయాలు ఏంటని గుర్తు చేసుకుని అలాంటి ఆహార పదార్థాలు వాడకూడదు.

అల్లం, తేనె లేదా బెల్లము కలిపి లేహ్యం మాదిరిగా చేసి భోజనానికి 15 నిమిషాలు
ముందు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...